రంగారెడ్డి

వాహనం ఢీకొని ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులకచర్ల, మార్చి 25: అతి వేగంగా వస్తున్న వాహనం.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలైన సంఘటన చోటు చేసుకుంది. కులకచర్ల మండలం కుసుమసంద్రం గిరిజన తండాకు చెందిన అయ్యనాయక్ శనివారం మధ్యాహ్నం వేళల్లో పాలమూరు వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయంది. దీంతో ఆయన అక్కడికక్కడే వరణించాడు. విషయం తెలిసిన తండావాసులు పాలమూరు జిల్లా పెద్ద దర్పల్లి (పిల్లిగుండు)కి వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
వీడిన బాలుడి కిడ్నాప్ మిస్టరీ
నార్సింగి, మార్చి 25: బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడిని లంగర్‌హౌస్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ జగన్ కథనం ప్రకారం... షాబానాబేగం తన భర్త కొంతకాలం క్రితం జైలుకు వెళ్లడంతో షాబానాబేగం రోడ్డుపైనే భిక్షాటన చేసుకుని జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో లంగర్‌హౌస్ ఆలంకార్ ధియేటర్ వద్ద షాబానాబేగం ఈనెల 16న మధ్యాహ్నం మద్యం సేవించి పడుకుంది. అయితే, గోల్కొండ కంచే ప్రాంతానికి చెందిన షఫి తనకు పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా రోడ్డుపై ఉన్న బాలుడిని తీసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. కాగా, బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. చివరికి సిసి కెమారాల ద్వారా పోలీసులు పరీశీలించగా సరిగ్గా షఫి ముఖం కనిపించలేదు. అయనప్పటికీ షఫీపై అనుమానం వచ్చిన పోలీసులు అతనిని పట్టుకుని విచారించగా అసలు విషయం బయట పడింది. తనకు పిల్లలు లేకపోవడంతోనే ఈ బాలుడిని కిడ్నాప్ చేశానని పోలీసులకు తెలిపినట్లు ఎస్‌ఐ జగన్ తెలిపారు. పోలీసులు కిడ్నాప్ చేసిన నిందితుడు షఫిని పోలీసులు అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. కాగా తన కుమారుడు తనకు లభించడంతో తల్లి షాబానాబేగం ఎంతో సంతోషించింది.

వాహనాలను తగులబెడుతున్న ముఠా అరెస్ట్

రాజేంద్రనగర్, మార్చి 25: పార్కింగ్ చేసిన వాహనాలను తగులబెడుతున్న నలుగురిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ తేజస్విని కాలనీకి చెందిన వీరభద్ర వీరేష్(22) ఆటోడ్రైవర్, అత్తాపూర్ ఎన్ ఎం గూడకు చెందిన మరాఠీ శివకుమార్(24) కార్ డ్రైవర్, తేజస్విని కాలనీకి చెందిన కాలూరి జితిన్ సాయికుమార్(19) బీటెక్ విద్యార్థి, అదే కాలనీకి చెందిన ములిగి రమేష్(20) ఆటోడ్రైవర్- నలుగురు స్నేహితులు. రమేష్ స్నేహితుల వెంట వీరేష్ తరుచూ ఆటోలో తిరిగేవాడు. వీరేష్ తన స్నేహితుడు రమేష్ ఫోన్ తీసుకొని తన చెల్లెలికి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ నెంబర్ డిలేట్ చేయకుండా తరుచూ వీరేష్ చెల్లెలికి ఫోన్ చేసి వేధిస్తున్నాడు. ఈ విషయం అన్న వీరేష్‌కు చెప్పింది. ఈ విషయంపై రమేష్‌తో, వీరేష్ గొడవ పడ్డాడు. ఎలాగైనా రమేష్ ఆటోను తగులబెట్టి తన కసి తీర్చుకోవాలని ప్లాన్ చేశాడు. గత సంవత్సరం డిసెంబర్ 25వ తేదిన వీరేష్ స్నేహితులైన శివకుమార్, సాయికుమార్‌లను సాయం అడిగాడు. దీనికి ఒప్పుకున్న వారు అత్తాపూర్ పెట్రోల్ పంపులో హాఫ్ లీటర్ పెట్రోల్ కొనుగోలు చేసి రమేష్ ఇంటి వద్ద పార్కు చేసిన ఆటోపై చల్లి నిప్పంటించారు. ఆ సమయంలో ఆ ఇంటి పక్కనే ఉండే దన్ను గమనించాడు. అక్కడి నుంచి పారిపోయారు. దన్ను చూసిన విషయాన్ని పోలీసులకు తెలుపుతాడనే భయంతో అతని ఆటోను సైతం తగులబెట్టాలని పథకం పన్నారు. దన్నుకు సంబంధించిన ఆటోను సైతం తగులబెడుతుండగా అదే ప్రాంతంలో ఉండే గోపాల్ గమనించాడు. ఆటో తగులబెట్టిన విషయాన్ని గోపాల్ ఎక్కడ బయటపెడతాడనే భయంతో అతని కారును సైతం పెట్రోల్ పోసి తగులబెట్టాడు. పోలీసులకు గోపాల్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నలుగురిని అరెస్ట్ చేసి విచారించగా వాహనాలు తగులబెట్టిన విషయాన్ని ఒప్పుకున్నారు. వారిని రిమాండ్‌కు తరలించారు.