రంగారెడ్డి

బస్సుపై పడిన విద్యుత్ స్తంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడంగల్, ఏప్రిల్8 : ప్రయాణిస్తూన్న బస్సుపై ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం వైర్లు తగిలి స్తంభం విరిగి బస్సుపై పడిన సంఘటన శనివారం మండల పరిధిలోని అంగడిరాయిచూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ప్రయాణికుల కథనం ప్రకారం పరిగి డిపోకు చెందిన ఆర్ టీసి బస్సు ఏపి 28 జెడ్ 2406గల బస్సు తాండూర్ నుంచి రుద్రారం వెళ్తుండగా అంగడిరాయిచూర్ గ్రామంలోకి చేరుకోగానే బస్సు టాపుపై ఉన్న రబ్బరు పైపులకు విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదవశాత్తు విద్యుత్ స్థంబం విరిగి బస్సుపై పడటం జరిగింది. విద్యుత్ స్తంభానికి కరెంటు సరఫరా ఉండటంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విషయం గమనించిన డ్రైవర్ చాకచక్యంతో బస్సును నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపించారు. విద్యుత్ వైర్లు రబ్బర్ పైపులపై పడటంతో బస్సుకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ఘటన జరిగినట్లు గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

దూసుకొచ్చిన డిసిఎం
ఒకరి మృతి * నలుగురికి గాయాలు
కెపిహెచ్‌బికాలనీ, ఏప్రిల్ 8: కూకట్‌పల్లి ఐడిఎల్ రోడ్డులో మృత్యుశకటంగా దూసుకువచ్చిన డిసిఎం ఒకరి ప్రాణాలను మింగగా మరో నలుగురిని ఆసుపత్రి పాలు చేసింది. ఈ ప్రమాధంలో వాకింగ్ కోసం వచ్చిన ఒకే అపార్ట్‌మెంట్‌కు చెందిన వారు తీవ్ర గాయాలపాలవడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే కూకట్‌పల్లి ఐడిఎల్ రోడ్డులో ఆంజనేయనగర్‌కు చెందిన ఒకే అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న జ్యోతి, రమ, పుష్పలత, లక్ష్మీజ్యోతి, ఉషలు శనివారం ఉదయం వాకింగ్ కోసమని ఐడిఎల్ రోడ్డుకు వెళ్లారు. కూకట్‌పల్లి వైపు నడుకుంటూ వాకింగ్ చేస్తున్న క్రమంలో రెయిన్‌బో విస్తా నుండి వచ్చిన డిసిఎం(టిఎస్07యువి8223) వారిని బలంగా ఢీకొట్టింది. దీంతో జ్యోతి(45) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందగా రమ, పుష్పలత, జ్యోతి, ఉషలతో పాటు అదే రోడ్డులో వాకింగ్ చేస్తున్న కిశోర్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాధంలో గాయపడిన వారిని స్థానికంగా ఉండే ఓమ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా రమ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలియచేశారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడని నిర్లక్ష్యంగా డిసిఎం నడపడంతో ప్రమాధం జరిగి ఉంటుందనే అమానునాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.