రంగారెడ్డి

ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రమైన సమాజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మే 13: హైదరాబాద్‌ని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దాలంటే కేవలం మున్సిపల్ సిబ్బంది పనిచేస్తేనే సాధ్యం కాదని, ప్రజలు సైతం భాగస్వాములు అయినప్పుడే అది సాధ్యమవుతుందని సౌత్‌జోన్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ సర్కిల్-6 కార్యాలయంలో స్వచ్ఛ రాజేంద్రనగర్ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంపై సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. స్వచ్ఛ హైదరాబాద్ నగరంగా తీర్చిదిద్దాలంటే రాజేంద్రనగర్ నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. వీధుల్లో చెత్తవేయకుండా ప్రజలకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత స్వచ్ఛగార్డులకు సూచించారు. సర్కిల్ పరిధిలో 45 ఓపెన్ స్థలాలను గుర్తించడం జరిగిందని, అక్కడ చెత్త డంపింగ్ చేయకుండా స్వచ్ఛగార్డులను ఎంపిక చేశామని అన్నారు.
తొమ్మిది మంది మున్సిపల్ సిబ్బంది, 36 మంది సమాజ సేవ చేసే వాలంటరీలకు బాధ్యతలను అప్పగించామని తెలిపారు. ప్రతి వీధిలో ప్రజలు చెత్తను వేయకుండా చూడాలని.. వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత వారిపై ఉందని అన్నారు. సర్కిల్ పరిధిలో చెత్తను డంపింగ్ చేయడానికి 42 ఆటో ట్రాలీలను ఏర్పాటు చేశామని తెలిపారు. 45 మంది స్వచ్ఛ గార్డులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్కిల్-6 డిప్యూటీ కమిషనర్ దశరథ్, డిఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మ, ఇంజనీరింగ్ ఇఇ లచ్చిరామ్, కార్పొరేటర్‌లు కోరణి శ్రీలత, రావుల విజయ జంగయ్య, నిసారుద్దీన్ పాల్గొన్నారు.
జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌ను
సన్మానించిన గ్రేటర్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని గ్రేటర్‌లోనే రాజేంద్రనగర్‌ను ముందంజలో నిలుపడం ఎంతో సంతోషంగా ఉందని గ్రేటర్ జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి అన్నారు.
శుక్రవారం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్‌రెడ్డి, సర్కిల్-6 డిప్యూటీ కమిషనర్ దశరథ్, డిఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మకు ప్రశంసా పత్రాలు అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని రాజేంద్రనగర్ సర్కిల్లో బాధ్యతగా తీసుకొని విజయవంతంగా తీర్చిదిద్దడం అభినందనీయమని కొనియాడారు.