రంగారెడ్డి

క్రికెట్ స్టేడియం వద్దబ్లాక్‌లో టిక్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఏప్రిల్ 9: ఉప్పల్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద ఐపిఎల్ మ్యాచ్‌ల కోసం బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తుండగా మల్కాజిగిరి స్పెషల్ ఆపరేషన్ టీం బృందం ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించి 25 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద 52 టిక్కెట్లు, రూ.32వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐపిఎల్ మ్యాచ్‌ల సందర్భంగా బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయించకుండా, మహిళలను వేధించకుండా ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దింపి సిసి కెమెరాల ద్వారా గట్టి నిఘా పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లను స్వయంగా తిలకించేందుకు క్రికెట్ అభిమానులు తరలి వచ్చారు. గంటన్నర ముందుగానే స్టేడియంకు చేరుకున్నారు. టిక్కెట్ల కోసం యువకులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు బ్లాక్‌లో విక్రయించే వారిపై ఆధారపడ్డారు. అధిక డబ్బులు చెల్లించి టిక్కెట్లను కొనుగోలు చేస్తుండగా ఎస్‌ఓటి పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తీసుకున్నారు.
కాగ్నా వంతెన నిర్మాణం ఎన్నడో?

మళ్లీ వర్షాకాలంలోనే పనులు గుర్తుకొస్తాయా?

తాండూరు, ఏప్రిల్ 9: తాండూరు - మహబూబ్‌నగర్ - చించోళి అంతరాష్ట్ర రహదారిలో ఉన్న తాండూరు కాగ్నా నది వంతెన అతిపురాతనమైంది. కాలం చెల్లి శిథిలావస్థకు చేరిన కాగ్నా నది పాత వంతెన స్థానంలోనే మరో నూతన బ్రిజ్జి కమ్ బ్యారేజీ పనులు చేపడుతామని దశాబ్ద కాలంగా పాలకులు హామీలు ఇస్తూ గాలికి వదిలేస్తున్నారు.
గతంలో కాంగ్రెస్, టిడిపి పాలకుల హయాంలో కేవలం హామీలకే పరిమితమైన కాగ్నా నదిపై నూతన వంతెన నిర్మాణం హామీ, ప్రస్తుత టిఆర్‌ఎస్ పాలకులు, తాండూరు నుండి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కాగ్నా నదిపై నూతన వంతెన నిర్మాణం బ్రిడ్జి, బ్యారేజి నిర్మాణం చేపడుతామంటూ కొత్త ప్రతి పాదన చేపట్టారు. దాంతో తాండూరు ప్రాంత ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కాగా మంత్రి పట్నం తన హామీలను తాండూరులో నిర్వహించే ప్రతి సభా వేదిక నుండి వాగ్ధానం చేస్తున్నా, అచరణలో మాత్రం అమలు కావడం లేదనే విమర్శలు పట్టణ పరిసరాల ప్రజల నుండి వినపడుతున్నాయి. కాగ్నా నది పరాతన వంతెనకు 115 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పటి నైజాం కాలంలో కర్నాటకలోని గుల్బర్గాకు చెందిన షాహి అనే కాంట్రాక్టర్ తాండూరు కాగ్నా నదిపై వంతెనతో పాటు, కర్నాటకలోని చించోళ్ళీ పరిసరాలలో ఒక వంతెనను నిర్మించినట్లు సమాచారం. కాగ్నా నదిపై వంతెనతోపాటు బ్యారేజి నిర్మాణం చేపట్టడంతో నది పరివాహాక ప్రాంతంలో భూగర్భ జలాలు సమృద్ధిగా నిల్వ ఉండి పట్టణానికి తాగునీటి కొరత ఉండదనే అభిప్రాయంతో ప్రజలు మంత్రి ప్రకటనను స్వాగతించారు.
కాగా గత ఏడాదిన్నర కాలంగా ఈ ప్రతిపాదనలు కేవలం హామీలకే పరిమితం అయ్యాయనే వాదనలు మిన్నంటుతున్నాయి. కాగా గత వర్షాకాలంలో చాలా ఏళ్ల తరువాత కాగ్నా నదికి భారీ వరదలు పోటెత్తటంతో శిధిలావస్థలో ఉన్న కాగ్నా నది వరదల తాకిడికి దాదాపు 60 మీటర్లు మేర గండిపడి తెగిపోయింది. దాంతో 20 రోజుల పాటు తాండూరు - మహబూబ్ నగర్ జిల్లాల తోపాటు, దాదాపు 350 గ్రామాలకు రవాణా సదుపాయం నిలిచి పోయింది.
రాష్ట్రంలో ఉన్న 7, 9 జాతీయ రహదారుల (పాత నెంబర్లు)కు అనుసంధానంగా ఉన్న ఈ అంతర్ రాష్ట్ర రహదారి నుండి రోజు వేలాది వాహనాలు, ట్రక్కులు, లారీలు రవాణా సాగిస్తుంటాయి. కాగా గత వర్షాకాలం పూర్తిగా రవాణా సదుపాయం దెబ్బతిని ఈప్రాంత వాసులు, వాహనదారులు అవస్థ పడ్డారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి అత్యంత ప్రధాన రవాణా వారధిగా ఉన్న కాగ్నా నది నూతన వంతెన, బ్యారేజీ నిర్మాణంలో తాత్సారం వహించటంతో ఈ ప్రాంత ప్రజలతో పాటు, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో నెలన్నర రోజుల్లో మళ్లీ వర్షాకాలం ముంచుకు వస్తున్నా, ఈ ప్రభుత్వ పాలకుల్లో చలనం లేకపోవటం సిగ్గుచేటు అనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా మంత్రి పట్నం.. కాగ్నా నదిపై నూతన వంతెన బ్యారేజీ నిర్మాణానికి రూ.19కోట్లు నిధులు కేటాయించామని త్వరలో పనులు ప్రారంభిస్తామంటున్నారు. కాగా గత ఫిబ్రవరి మాసంలో తాండూరుకు విచ్చేసిన రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గత వారం తాండూరుకు వచ్చిన మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కెటిఆర్ సభలలో ఆయా మంత్రుల సమక్షంలో మంత్రి కాగ్నా నదిపై కొత్త వంతెన, బ్యారేజీ నిర్మాణం చేపడుతామంటూ పునరుద్ఘాటించారు. పాలకులు కళ్లు తెరచి కాగ్నా వంతెన పనులు చేపట్టాలని అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేస్లున్నారు.