రంగారెడ్డి

వర్షపు నీటిని సంరక్షించు కోవాలి: పట్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, ఏప్రిల్ 10: భూమిపై పడిన ప్రతి వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడానికి జలనిధి దోహదం చేస్తుందని రవాణశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. సోమవారం చేవెళ్ల మండల పరిషత్ కార్యాలయంలో జలనిధి ప్రచారాన్ని ప్రారంభించారు. భూమిపై పడిన ప్రతి వర్షపు చుక్కను సంరక్షించు కోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వర్షపు నీటిని ఇంకుడు గుంతాల ద్వారా భూమిలోకి ఇంకించినట్లయితే భవిషత్త్‌లో నీటి కోసం ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఇంకుడుగుంతల నిర్మాణాన్ని ఉపాధిహామీ పథకం ద్వారా ప్రభుత్వం ప్రోత్సహం అందిస్తుందని పేర్కొన్నారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకునేవారు ముందుగా ఇంకుడుగుంత నిర్మాణం చేపట్టాలని సూచించారు. చిన్న ఊటకుంటాలు, కందకాలు, చెరువులో పూడికతీత, తవ్వకం, ఫీడర్ కాలువలు, నీటి నిల్వతో భూగర్భజలాలు పెంపొందించుకొవచ్చని తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపిపి బాల్‌రాజ్, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మధుగుప్త, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదగిరి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మెన్ మాణిక్యరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు పాండు యాదవ్, ఎంపిడివో రత్నమ్మ, నాయకులు శర్వలింగం, సత్యనారాయణరెడ్డి ఉన్నారు.

ప్రజాస్వామ్య ముసుగులో రాచరిక పోకడ
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 10: ప్రజాస్వామ్య ముసుగులో ముఖ్యమంత్రి కెసిఆర్.. రాచరిక పోకడలు అవలంభిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి మందగడ్డ విక్రంకుమార్ ధ్వజమెత్తారు. చందానగర్‌లోని భగత్‌సింగ్ భవన్‌లో జరిగిన పార్టీ 26వ రాష్ట్ర కమిటీ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. విక్రంకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతన్నలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు గత 34నెలల్లో 2700కు చేరుకోవడం దురదృష్టకరమని అన్నారు. మద్యాన్ని ఆదాయ వనరుగా భావించడంతో మూడేళ్ళలో ఐదు రెట్లు పెరిగి రూ.15వేల కోట్లు రాష్ట్ర ఖజానాలో చేరాయని చెప్పారు. మద్యం మహమ్మారికి అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నా పాలకులు పట్టించుకోకుండా, వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో తెలంగాణేతర కాంట్రాక్టర్లు రాజ్యమేలుతున్నారని, స్థానికులకే కాంట్రాక్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిధులు లేకపోవడంతో స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతున్నా పట్టించుకోకపోవడం నిరంకుశ వైఖరికి అద్దం పడుతుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక సమాఖ్య నగర కార్యదర్శి జి.నాగేందర్ కుమార్, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ ఎల్.వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టిఆర్‌కెఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగుళ్ళ కృష్ణారెడ్డి, కార్యదర్శులు బి.సురేష్, బి.మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు సమాఖ్య ప్రధాన కార్యదర్శి పడమటి రాంరెడ్డి పాల్గొన్నారు.