రంగారెడ్డి

హెచ్‌సిఏ మాజీ అధ్యక్షుడి ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, మే 13: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో జరుగుతున్న కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలపై ఏసిబి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ హెచ్‌సిఏ మాజీ అధ్యక్షుడు వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ముందు ధర్నా జరిపారు. హెచ్‌సిఏ ప్రస్తుత అధ్యక్షుడు అర్షద్ అయూబ్ తన ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నాడని, అసోసియేషన్ నిధులను దుర్వినియోగం చేస్తూ స్వాహా చేస్తున్నట్టు ఆరోపించారు. కమిటీ సభ్యుల కనీస తీర్మానం లేకుండానే నిధుల మళ్లింపు జరుగుతుందని అన్నారు. ప్రశ్నించిన సభ్యులను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. హెచ్‌సిఏ పదవీ కాలం మే 27న ముగుస్తుందని, నేటివరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయలేదని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ఎన్నిసార్లు కోరినా కనీస స్పందన లేదని అన్నారు. హెచ్‌సిఏలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై వెంటనే విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి పదవీ కాలం ముగిసిన వెంటనే కొత్త అసోసియేషన్ బాధ్యత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. హెచ్‌సిఏ మాజీ అధ్యక్షుడు వినోద్‌కుమార్, సభ్యులు శేషునాయక్, బాబురావు పాల్గొన్నారు.