రంగారెడ్డి

ఆకుపచ్చ తెలంగాణకు కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఏప్రిల్ 11: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించి ఆకుపచ్చ తెలంగాణ కోసం పౌరులందరూ కృషి చేయాలని హరితహారం రాష్ట్ర ప్రత్యేకాధికారి, సిఎం కార్యాలయ ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డితో కలిసి మేడ్చల్ మండలం కండ్లకోయతో పాటు మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. తొలుత కండ్లకోయలో రోడ్ల వెంబడి నాటిన మొక్కలను పరిశీలించి గ్రామపంచాయతీ సిబ్బందిని అభినందించారు. రోడ్ల వెంబడి నాటిన మొక్కల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను స్థానిక సర్పంచ్ నరేందర్‌రెడ్డి, కార్యదర్శి చంద్రప్రకాశ్‌ను అడిగి తెలుసుకున్నారు. ట్రీగార్డులను అపహరిస్తున్నారని సర్పంచ్ చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అక్కడి నుండి నేరుగా మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయానికి చేరుకుని కార్యాలయ ఆవరణలో నాటిన మొక్కలను పరిశీలించారు. రాష్ట్రంలోని మేడ్చల్ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణ హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించడంలో బేష్ అంటూ కితాబిచ్చారు. కార్యాలయ ఆవరణలోని ప్రతి మొక్కను అప్యాయంగా స్పర్శిస్తూ పరిశీలించారు. ఓఎస్‌డి వర్గీస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో విధిగా మొక్కలు నాటాలని ఆదేశించారు. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి ఒకో మొక్కను బాధ్యతగా తీసుకుని పెంచాలని కోరారు. ప్రతీ ఇంటికి ఇంకుడుగుంతతో పాటు మొక్కలు కూడా నాటాలనే నిబంధనను పెట్టాలని సూచించారు. ప్రజల్లో మార్పు తీసుకురావాలని అకాంక్షించారు. ఇదే తరహాలో మరో సంవత్సరం కొనసాగితే రాష్ట్రం ఆకుపచ్చగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొక్కల పెంపకంపై త్వరలోనే సర్పంచ్‌లతో సమావేశం నిర్వహించాలని కలెక్టర్‌ను కోరినట్లు వివరించారు. కలెక్టర్ ఎంవి రెడ్డి మాట్లాడుతూ ఎన్నో పోషక గుణాలు కల్గిన మొక్కలు ప్రకృతి మనకి అందించినప్పటికీ ప్రస్తుతం కాలానుగుణంగా నేడు అవన్నీ కనుమరుగు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్‌లు అవసరమైతే నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మేడ్చల్ జిల్లాను హరితహారంలో మొదటి స్థానంలో నిలిచేలా తీర్చిదిద్దాలని అన్నారు. డిఎస్‌ఓ కృష్ణ, డిపిఓ సురేశ్‌మోహన్, ఎఎంసి చైర్మన్ సత్యనారాయణ, ఎంపిపి విజయలక్ష్మీ, జడ్పీటిసి శైలజ హరినాథ్, తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపిడిఓ దేవసహయం, ఇఓపిఆర్డీ రమేశ్, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు రాజమల్లారెడ్డి, రేంజ్ అధికారి లక్ష్మణ్, శ్రీనివాస్, సాగర్, శ్రీ్ధర్, టిఆర్‌ఎస్ నాయకులు మల్లికార్జున్, మర్రి నర్సింహ్మరెడ్డి, నందారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.