రంగారెడ్డి

వికారాబాద్ పట్టణంలో ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మే 13: పట్టణంలో ఈనెల 15న నిర్వహించనున్న ఎంసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎంసెట్ పరీక్ష రీజినల్ కో ఆర్డినేటర్, శ్రీ అనంతపద్మనాభ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నర్సింగ్‌రావు వెల్లడించారు. శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పట్టణంలో ఎంసెట్‌ను ఎస్‌ఎపి కళాశాల, సెయింట్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
రెండు పరీక్షా కేంద్రాల్లో 2442 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 నుండి ఒంటి గంట వరకు, అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5.30 గంటల వరకు ఉంటుందని అన్నారు. ఇంజనీరింగ్ పరీక్ష రాసే అభ్యర్థులు 9 గంటలకు, అగ్రికల్చర్, మెడికల్ రాసేవారు 1.30 గంటలకల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఎస్‌ఎపి కళాశాలలో 808 మంది ఇంజనీరింగ్, 684 మంది అగ్రికల్చర్, మెడికల్ పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు. సెయింట్‌జూడ్స్ పాఠశాలలో 550 మంది ఇంజనీరింగ్, 400 మంది అగ్రికల్చర్, మెడికల్ పరీక్ష రాయనున్నారని వివరించారు. బయోమెట్రిక్ పద్ధతిన అటెండెన్స్ ఉంటుందని సూచించారు. అభ్యర్థులు తమ వెంట హాల్‌టికెట్, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని చెప్పారు. సెల్‌ఫోన్, క్యాలుకులేటర్, గడియారం లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తెచ్చుకోరాదని స్పష్టం చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ఒఎంఆర్ షీట్ తప్పక ఇవ్వాలని లేని ఎడల క్రిమినల్ కేసు నమోదు చేస్తారని హెచ్చరించారు.