రంగారెడ్డి

బావమరిది చేతిలో బావ హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, మే 15: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో కోహెడ గ్రామంలో రెండో పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో బావమరిది బావను చంపిన విషయం తెలిసిందే.ఈ కేసులో బావమరిది తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం ఎల్బీనగర్ డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిసిపి వెంకటేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం కోహేడ గ్రామానికి చెందిన పోచగారి యాదగిరి(40)కి ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి గ్రామాకి చెందిన ఆగు జ్యోతితో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.వీరికి ముగ్గురు కూతుళ్ల్లు, ఒక కుమారుడు ఉన్నారు.అయితే జ్యోతి అత్త,మామాలు, మరిది వేధింపులు తట్టు కోలేక 2011 లో పురుగుల మందు సేవించి ఆత్మ హత్య చేసుకుంది. జ్యోతి తల్లిదండుల ఫిర్యాదు మేరకు వీరిపై పోలీస్ స్టేషన్ కేసునమోదయంది.కొన్ని రోజుల తర్వాత యాదయ్య రెండో వివాహానికి సిద్ధమవగా జ్యోతి తల్లి దండ్రులు పెద్దల సమక్షంలో పంచాయితీ ఏర్పాటు చేసి రెండో వివాహం చేసుకుంటే జ్యోతి పిల్లల పేరు మీద గ్రామంలో ఉన్న భూమిని పట్టా చేయాలని అడిగారు. దీనికి యాదయ్య అంగీకరించకుండా ఏమి చేసుకుంటారో చేసుకోండి అని మొండి కేశాడు. ఈనెల 12 వ తేదీన ఇబ్రహీట్నం మండలం రాయపోలు గ్రామానికి చెందిన రానూరి భూదేవిని రెండో వివాహం చేసుకున్నాడు. ఇది తెలుసుకున్న బావమరిది యాదగిరి (25)తో పాటు తమ గ్రామానికి చెందిన రాకేష్(23) కొత్తరావుల బీరప్ప(36)లతో కోహెడ గ్రామానికి వెళ్లి ఇంట్లో ఉన్న యాదయ్యను కత్తులతో పొడిచి హత్య చేసి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం బొంగ్లూర్ గేట్ వద్ద ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా యాదగరితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు డిసిపి తెలిపారు. ఈసమావేశంలో వనస్థలిపురం ఎసిపి రవిందర్ రెడ్డి, సి ఐ నరేందర్ గౌడ్ పాల్గొన్నారు.

తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని..
నాలుగున్నర కోట్ల ఘరానా మోసం * బాధితుల ఫిర్యాదు
నేరేడ్‌మెట్, మే 15: తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలు పలువురి వద్ద వసూలు చేసి బురిడీ కొట్టించిన మహిళపై బాధితులు ఫిర్యాదు చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మల్కాజిగిరి సిఐ జానకిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వౌలాలి ఎంజెకాలనీలో నివసించే అరుణరెడ్డి (50) బంగారం వ్యాపారం పేరుతో తనకు పరిచయం ఉన్న వారిని ఎంచుకుని తక్కువ ధరకు ఎక్కువ బంగారం ఇపిస్తానని చెప్పింది. మొదటగా వినియోగదారులను నమ్మించేందుకు తక్కువ ధరకు ఎక్కువ బంగారం అందజేసింది. వినియోగదారుల వద్ద నమ్మకం కలిగే వరకు తక్కువ ధరకు బంగారం అందజేసిన అమె వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని తన వద్ద ఎక్కువ మొత్తంలో బంగారం ఉందని మాయమాటలు చెప్పి డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి పది మంది నుండి సుమారు నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసిందని సిఐ తెలిపారు. డబ్బులు తీసుకుని బంగారం ఇవ్వకపోవడంతో పాటు తప్పించుకు తిరుగుతుండడంతో అనుమానం వచ్చిన బాధితులు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఆసుపత్రికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల
కెపిహెచ్‌బికాలనీ, మే 15: ఆసుపత్రికి వెళ్లి వచ్చే సరికి ఇళ్లు గుల్లైన సంఘటన కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నిజాంపేట్‌లోని అల్లాపూర్ సోసైటీలో నివాసముంటున్న వాసిరెడ్డి హన్మంత్‌రావు దంపతులు సోమవారం ఉదయం 9 గంటల సమయంలో బంధువుల చికిత్స నిమిత్తం బంజారా హిల్స్‌లోని కేర్ ఆసుపత్రికి వెళ్లారు. మధ్యాహ్నం 1.30 సమయంలో తిరిగి ఇంటికి వచ్చే సరికే ఇంటి ప్రధాన ద్వారం తలుపు గడియ పగలగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూశారు. బీరువాలో గల 30 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. బాధితులు కెపిహెచ్‌బి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూకట్‌పల్లి ఎసిపి భుజంగరావు, డిఐ బాలకృష్ణలు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.