రంగారెడ్డి

విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న పాలకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 19: ప్రభుత్వ విద్యావ్యవస్థను పాలకులు, అధికారులు చిన్నాభిన్నం చేస్తున్నారని టిఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.ఆంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక న్యూ నాగార్జున హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన వికారాబాద్ జిల్లా టిఎస్‌యుటిఎఫ్ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలోనే అతి పెద్ద విద్యావ్యస్థను ఎవ్వరికి నచ్చిన విధంగా వారు ముక్కలుగా చేస్తున్నారని వాపోయారు. ఒక రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఒకే రకంగా ఉండాలని, తెలంగాణలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిస 15 రకాలుగా విభజించి, ఒకదానికొకటి సంబంధం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా విద్యావ్యవస్థను కాపాడాలని కోరారు. అంతరాలు గల వ్యవస్థ చాలా కాలం నిలవదని అభిప్రాయపడ్డారు. సమావేశానికి అధ్యక్షత వహించిన టిఎస్‌యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ వెంకటరత్నం మాట్లాడుతూ కెజిబివిల్లో కాంట్రాక్టు రిక్రూట్‌మెంట్ టీచర్లను రెగ్యులర్ టైంస్కేల్‌గా నియమించాలని డిమాండ్ చేశారు. 12 సంవత్సరాలుగా సేవలందిస్తూ ఉత్తమ ఫలితాలను అందిస్తున్న సిఆర్‌టిలకు వేతనాలు అందించడంలో ప్రభుత్వం సవతితల్లి ప్రేమను చూపుతోందని ఆరోపించారు.
జిల్లాలో ఎయిడెడ్ విద్యాలయాల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఎయిడెడ్ విద్యావ్యస్థను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిర్వహించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18వేల ఉపాధ్యాయ పోస్టులకు వెంటనే డిఎస్‌సి నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కొత్త జిల్లాలకు పూర్తిస్థాయి
అధికారులను నియమించాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలకు పూర్తిస్థాయి డిఇవో, డివో, జూనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్‌లను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలు పరిష్కారం కావడంలేదని పేర్కొన్నారు. సమావేశంలో టిఎస్‌యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ వెంకటరత్నం, ఉపాధ్యక్షురాలు నీలమ్మ, ప్రధాన కార్యదర్శి ఎన్.మహిపాల్‌రెడ్డి, కోశాధికారి బాబూరావు, జిల్లా కార్యదర్శులు వెకటేశ్, కరుణాకర్, పవన్‌కుమార్ పాల్గొన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
కీసర, జూన్ 19: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు వెంటనే పరిష్కరించాలని మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ధర్మారెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 41 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. కీసర మండలం దమ్మాయిగూడ గ్రామంలోని నాసిన్ చెరువు దగ్గర ఉన్న శ్మశాన వాటికను ఎత్తివేయాలని సర్పంచ్ అనూరాధతో పాటు పలువురు కాలనీవాసులు వెళ్లి జెసి ధర్మారెడ్డికి వినతిపత్రం అందజేసారు. కాలనీల మధ్యలోనే శ్మశాన వాటిక ఉన్నందున ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. ఇళ్లను ఆనుకొని ఉన్న మురుగునీటి బావిని పూడ్చివేయాలని కోరుతూ మేడిపల్లి మండలం, బోడుప్పల్ వాసవీనగర్ కాలనీ వాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసారు. మురుగునీటి బావితో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వర్షాలకు కాలనీల్లోకి డ్రైనేజీ నీరు చేరుతోందని, తక్షణమే డ్రైనేజీ మరమ్మతులు చేపట్టాలని వివరించారు. షామీర్‌పేట్ మండలం యాడారం గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బిసిల స్వయం ఉపాధి పథకాలకు రుణాలు మంజూరు చేయాలని గ్రామ దళిత సేన అధ్యక్షుడు యాదగిరి వినతి పత్రం అందజేసారు. జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ధర్మారెడ్డి మాట్లాడుతూ హరితాహారం కింద మొక్కలు నాటేందుకు సంబంధిత శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని, గ్రామ పంచాయతీ లేఔట్‌లు, ఉద్యానవన పొలాలు, చెరువుగట్లు, ఖాళీ ప్రదేశాలల్లో విరివిగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సురేందర్‌రావు, డిపిఒ సురేశ్‌మోహన్, సిపిఒ సౌమ్య పాల్గొన్నారు.