రంగారెడ్డి

భావి ప్రధాని రాహుల్ గాంధీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 19: భవిష్యత్ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అని వికారాబాద్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బి.రాజశేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం భారత జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ 47వ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాల్లో 2019లో జరిగే ఎన్నికల్లో రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ ప్రధానకార్యదర్శులు జె.వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఎంఎస్ సుభాన్‌రెడ్డి, ప్రధానకార్యదర్శులు ప్రమోద్‌కుమార్, మతిన్, వెంకట్ పాల్గొన్నారు.
చేవెళ్ల: రాహుల్‌గాందీ జన్మదిన సందర్భంగా చేవెళ్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం డిసిసి మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జర్పుకోవాలని దేవుని ప్రార్థస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
మేడ్చల్: అఖిలభారత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ 47వ జన్మదిన వేడుకలను పార్టీ మేడ్చల్ పట్టణ అధ్యక్షుడు ఎన్.బాలమల్లేశ్ ఆధ్వర్యంలో శ్రేణులు సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ ప్రధాన కూడళి అంబేద్కర్ విగ్రహం సమీపంలో నిర్వహించిన జన్మదిన వేడుకల సందర్భంగా రాహుల్‌గాంధీ చిత్రపటం వద్ద నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. 2019 సంవత్సరంలో జమిలి ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో రాహుల్‌గాంధీ నేతృత్వంలో అధికారంలోకి రావడం ఖాయమని నాయకులు దీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వరదారెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యదర్శి చిట్టిమిల్ల రాగజ్యోతి, నాయకులు సంజీవరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వేముల శ్రీనివాస్‌రెడ్డి, దాత్రిక లింగం, జకట దేవ, బర్ల సంతోష్, సుధాకర్‌రెడ్డి, మామిళ్ల రాహుల్ యాదవ్, ప్రకాశ్‌రెడ్డి, రాఘవేందర్‌గౌడ్, నర్సింహారెడ్డి, గఫ్పార్ పాల్గొన్నారు.
విద్యార్థులకు నోటుపుస్తకాలు పంపిణీ
కెపిహెచ్‌బి: ఎఐసిసి జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు సోమవారం కాంగ్రెస్ సీనీయర్ నాయకులు పటోళ్ల నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరుపుకున్నారు. భరత్‌నగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను నోటు పుస్తకాలను అందజేశారు. దేశానికి ఆశా జ్యోతి రాహుల్‌గాంధీ అని అన్నారు. వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఒక మహావృక్షం వంటిందని వర్ణించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. నాయకులు విజయ్‌కుమార్, లక్ష్మీనారాయణ, జయమ్మ, సంతోష్, వేదమణి, గీత, నారాయణ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఎంసిఎ విద్యార్థి దుర్మరణం

ఉప్పల్, జూన్ 19: రోడ్డు ప్రమాదంలో పిజి విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నారపల్లి వెంకటాద్రి టౌన్‌షిప్‌లో నివసిస్తున్న ఎన్.వీరస్వామి కుమారుడు అశోక్ చక్రవర్తి (21) సికింద్రాబాద్‌లోని పిజి కాలనీలో ఎంసిఎ చదువుతున్నాడు. సోమవారం మేడిపల్లి-నారపల్లి మధ్యలో నందనవనం వద్ద రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు వేగంగా వచ్చిన లారీ నెంబర్ (టిఎస్ 08యుఇ 1247) ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే రక్తం మడుగులో కుప్పకూలిపోయి మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.