రంగారెడ్డి

రాష్ట్రంలో 84 వేల సంఘాలకు గొర్రెల పంపిణీ:

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొంరాస్‌పేట, జూన్ 20: కురుమ, గొల్లలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ నాలుగువేల కోట్ల నిధులతో కురుమ, గొల్లలకు గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని నాస్కన్‌పల్లి గ్రామంలో కురుమ,యాదవులకు గొర్రెలు పంపిణీ చేశారు. బొంరాస్‌పేట మండలం నుండి గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టేందుకు వచ్చిన మంత్రికి కురుమ, యాదవులు కురువ డోలు, మేళతాళలతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందని అన్నారు. వికారాబాద్ జిల్లాలో ఈ పథకం కింద జిల్లాలో పదివేల మంది లబ్ధిదారులున్నారని, కొడంగల్ నియోజకవర్గంలో 2336 మంది కురుమ, యాదవులు లబ్ధి పొందనున్నారని అన్నారు. ఇతర రాష్టల్ర నుండి గొర్రెలను కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నామని అన్నారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీళ్లు అందజేస్తామని, ఇందుకోసం ఆరువందల కోట్ల రూపాయల నిధులతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రంలోని చెరువులు, కుంటల అభివృద్ధికోసం రూ. 450కోట్లతో పనులు జరుగుతున్నట్లు వివరించారు. రోడ్ల అభివృద్ధికోసం రూ. 2800 కోట్లతో పనులు జరుగుతున్నాయని, పంచాయతీ రాజ్ రోడ్ల కోసం రూ. 800 కోట్లు కేటాయించడం జరిగిందని, ఆర్‌అండ్‌బి రోడ్ల కోసం 2000 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.

కుల వృత్తుల ప్రోత్సాహంతోనే ఆర్థికాభివృద్ధి
* జిల్లాలో 2945 గొర్రెల యూనిట్‌లు మంజూరు
కీసర, జూన్ 20: కుల వృత్తులను ప్రోత్సహించి వారి ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కీసర మండలం, చీర్యాలలో గొర్రెల పంపిణీ పథకాన్ని మహేందర్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాలో 32 కోట్ల వ్యయంతో, 2945 యూనిట్‌ల గొర్రెలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 450 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కుల వృత్తులను ఆదుకోవాలన్నదే కెసిఆర్ ధ్యేయమన్నారు. ఎంపి మల్లారెడ్డి మాట్లాడుతూ గొర్రెల పంపిణీ వల్ల వచ్చే రెండేళ్లలో 20 కోట్ల రూపాయల రాబడి వస్తోందని తెలిపారు. కెసిఆర్ కుల వృత్తులకు పెద్దపీట వేస్తున్నార