రంగారెడ్డి

సర్కారు స్కూళ్లకూ డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జూన్ 20: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమేణ పెరుగుతోంది. పెరుగుతున్న విద్యా ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రెండు విడతలుగా నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో విద్యార్థులు వేల సంఖ్యల్లోనే చేరారు. ప్రభుత్వం సర్కారు బడులకు కల్పిస్తున్న విద్యా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ బడులకు వెళ్లే విద్యార్థులను సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. బడిబాట కార్యక్రమానికి చక్కని ఫలితాలు వచ్చాయని విద్యాశాఖ అధికారులు తెలుపుతున్నారు. పాఠశాలల విద్యా కమిషన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు, రెండవ విడత జూన్ 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యాశాఖ అధికారులు ఇంటింటికీ తిరిగి పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని, నాణ్యమైన విద్య బోధిస్తున్నట్లు ప్రచారం కొనసాగించడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక ఇలా..
ఫరూఖ్‌నగర్ మండలంలో 72 ప్రాథమిక పాఠశాలలు, 13 ప్రాథమికోన్నత పాఠశాలలు, 13 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. రెండవ విడత బడిబాట కార్యక్రమంలో 218 మంది చిన్నారులు అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలల్లో చేరినట్లు విద్యాశాఖ అధికారి శంకర్‌రాథోడ్ వివరించారు. కేశంపేట మండలంలో 30 ప్రాథమిక పాఠశాలలు, తొమ్మిది ప్రాథమికోన్నత పాఠశాలలు, తొమ్మిది ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. రెండు విడతల బడిబాట కార్యక్రమంలో భాగంగా 977 మంది చిన్నారులు పాఠశాలల్లో చేరినట్లు వివరించారు. కొందుర్గు, జిల్లేడుచౌదరిగూడ మండలాల్లో 76 ప్రాథమిక పాఠశాలలు, 15 ప్రాథమికోన్నత పాఠశాలలు, ఆరు ఉన్నత పాఠశాలలున్నాయి. కొందుర్గు మండలంలో మొదటివిడత బడిబాట కార్యక్రమంలో 2454 మంది చిన్నారులు, రెండవ విడతలో 187మంది చిన్నారులు అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించినట్లు ఇన్‌చార్జి ఎంఇఓ కిష్టారెడ్డి తెలిపారు. జిల్లేడు చౌదరిగూడ మండలంలో మొదటి విడతలో 3273 మంది చిన్నారులు, రెండవ విడతలో 280మంది చిన్నారులు అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించినట్లు ఆయన తెలిపారు. కొత్తూరు మండలంలో 24ప్రాథమిక పాఠశాలలు, నాలుగు ప్రాథమికోన్నత పాఠశాలలు, ఐదు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కస్తూర్బా గాంధీ పాఠశాల ఒకటి. మొదటి విడతలో అంగన్‌వాడీ కేంద్రాల్లో 76 మంది చిన్నారులను, పాఠశాలల్లో 36మంది చిన్నారులను చేర్పించినట్లు ఇన్‌చార్జి ఎంఇఓ కృష్ణయ్య తెలిపారు. రెండవ విడతలో అంగన్‌వాడీల్లో 38 మంది, పాఠశాలల్లో 52 మంది మొత్తం 197 మందిని చేర్పించినట్లు వివరించారు. నందిగామ మండలంలో 28 ప్రాథమిక పాఠశాలలు, మూడు ప్రాథమికోన్నత పాఠశాలలు, ఐదు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొదటి విడత బడిబాటలో 71మంది చిన్నారులను అంగన్‌వాడీలో, ప్రాథమిక పాఠశాలలో 41మంది చిన్నారులను చేర్పించినట్లు వివిరంచారు. రెండవ విడతలో 37మంది చిన్నారులను అంగన్‌వాడీల్లో, 39మంది ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 178మంది చిన్నారులను చేర్పించినట్లు తెలిపారు.
సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని కేశంపేట ఇన్‌చార్జి ఎంఇఓ మనోహర్ వివరించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల భాషపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. డిజిటల్ క్లాసులు నిర్వహించి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యాబోధన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్తీర్ణత శాతం పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఉపాధ్యాయులు పాఠశాలల సమయవేళలు పాటిస్తూ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యాబోధన చేస్తున్నారని అన్నారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ స్కూళ్లకు వచ్చేందుకు తల్లిదండ్రులు శ్రద్ధ చూపించాలని కోరారు.

మేడిపల్లిలో విజృంభిస్తున్న దొంగలు
* సైంటిస్టు ఇంట్లో చోరీ

ఉప్పల్, జూన్ 20: మేడిపల్లి పిఎస్ పరిధిలో దొంగల ఆగడాలు రోజు రోజుకూకు పెరిగిపోతున్నాయి. వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళన చెందుతుండగా దొంగలను పట్టుకోవడానికి కంటికి నిద్ర లేకుండా రాత్రింబవళ్లు గస్తీలు ముమ్మరం చేస్తున్నారు. అయినప్పటికీ దొంగతనాలు ఆగడంలేదు. తాజాగా చెంగిచర్ల మైవిలాస్‌లో నివసిస్తున్న ఇక్రిశాట్‌లో సైంటిస్టుగా పనిచేస్తున్న శ్రీ్ధర్ కుటుంబ సభ్యులతో సోమవారం ఇంటికి తాళం పెట్టి హబ్సిగూడలోని బంధువుల ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేలోగా దొంగలు చొరబడ్డారు. తాళాలు విరగ్గొట్టి అల్మారాలో ఉన్న 10తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు తెలిపారు. నారపల్లి దివ్యానగర్‌లో నివసిస్తున్న మోత్కూరుకు చెందిన గోల్డ్‌స్మిత్ కృష్ణ సోమవారం స్వగ్రామానికి వెళ్లి వచ్చేలోగా ఇంట్లో ఉన్న తులం బంగారం, 30 తులాల వెండి, సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు వచ్చిందన్నారు. తాళం విరగ్గొట్టకుండానే తలుపులు తెరిచి దొంగతనం ఎలా చేశారన్న అనుమానం వ్యక్తమవుతోంది. పక్కనే ఉన్న వారిపైన అనుమానం ఉందని తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ జగన్నాధరెడ్డి తెలిపారు.