రంగారెడ్డి

క్రీడల్లోనూ రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 27: చిన్నారులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మంగళవారం ఉప్పల్ సౌత్ స్వరూప్‌నగర్ స్ట్రీట్ నెంబర్ 1లో స్టార్ షైన్ ప్లేస్కూల్‌ను ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు.
నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరలని, కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి భవిష్యత్‌లో బంగారు బాటలు వేయాలని పేర్కొన్నారు. సకల సౌకర్యాలను కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యాసంస్థలు పోటీపడుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా విద్యను అందిస్తూ విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్లే స్కూల్ నిర్వాహకులు కె.మనీష్, కళ్యాణి నాగేందర్, బిజెపి నాయకులు గొరిగె కృష్ణ, మంకాల లక్ష్మ ణ్, రావుల బాలకృష్ణ గౌడ్, ఎస్.్ధర్మారెడ్డి, ఈగ శ్రీనివాస్, ప్రవేష్‌సింగ్ పాల్గొన్నారు.

ప్రజలకు వౌలిక వసతులను కల్పించడమే బాధ్యత
జీడిమెట్ల, జూన్ 27: ప్రజలకు వౌలిక వసతులను కల్పించడమే తన బాధ్యత అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ అన్నారు. మంగళవారం సుభాష్‌నగర్ డివిజన్ తెలుగుతల్లి నగర్, 60గజాల బస్తీలలో వివేక్ పాదయాత్ర చేశారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలను నేరుగా తెలుసుకున్నారు.
వివేక్ మాట్లాడుతూ తెలుగుతల్లినగర్‌లో భూగర్భ డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు తదితర సమస్యలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. బస్తీలో ఎక్కడపడితే అక్కడ మురుగునీరు నిలబడడం, అధ్వాన్నంగా రోడ్లు ఉన్నాయని చెప్పారు. భూగర్భ డ్రైనేజీ, రోడ్డు పనులను పునరుద్ధరిస్తామని అన్నారు. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండబ్ల్యుఎస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వివేక్ ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్‌ఎండబ్ల్యుఎస్ ప్రాజెక్టు జిఎం శివరాజ్ గౌడ్, డిజిఎం సుబ్రమణ్యం, జిహెచ్‌ఎంసి ఇఇ రాజ్‌కుమార్, ఎఇ సురేందర్ నాయక్, నాయకులు రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
అయోధ్యనగర్‌లో ప్లాంట్ ప్రారంభం
జీడిమెట్ల డివిజన్ అయోధ్యనగర్‌లో సేయింట్ దేవదాసయ్య చారిటబుల్ ట్రస్ట్ మినరల్ వాటర్ ప్లాంట్‌ను స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్ ప్రారంభించారు. వివేక్ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో మరిన్ని చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఏసు, రాజ్‌కుమార్, రమేశ్, సోమయ్య, జ్ఞానేశ్వర్, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ
సూరారం డివిజన్ కళావతినగర్, రాజీవ్ గాంధీనగర్, మార్కండేయనగర్ ప్రాంతాలలో ఎనిమిది మందికి కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకం కింద స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్.. ఇంటింటికీ తిరిగి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సత్యనారాయణ, నాయకులు సిద్ధిక్, జానకిరామ్, ఫెరోజ్, భిక్షపతి, అరుణ, లక్ష్మీ, శ్రీనివాస్, కిరణ్, రాజు పాల్గొన్నారు.