రంగారెడ్డి

సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం: సబిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూన్ 27: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఉదయం క్యామ నవీన్‌కుమార్ డెంగ్యూ వ్యాధితో మృతిచెందడంతో మంగళవారం నవీన్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వ పని తీరును ఎండగట్టింది. హైదరాబాద్‌ను మురికికుంటగా చేసిన ఘనత కెసిఆర్‌కే దక్కిందని మండిపడ్డారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాల సరసన చేర్చుతామని గొప్పలు పలికిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఇదేనా అభివృద్ధి అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ఏ మూలకు వెళ్లినా గుంతలమయమైన రోడ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీ వ్యవస్థ, దుర్గంధం వెదజల్లుతున్న పారిశుద్ధ్య వ్యవస్థ చెప్పుకుంటూపోతే ఎన్నో సమస్యలతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని విమర్శించారు. క్యాబినెట్‌లో మంత్రులు ఉన్నా ప్రయోజనం లేదని అన్నారు. ఇంట్లో నాలుగు ఉద్యోగాలు కల్పించుకొని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ అందిన కాడికి దోచుకు తింటున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డికు కనీసం చలనం కూడా లేదని ఎద్దేవా చేశారు. పరామర్శించిన వారిలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.కార్తీక్‌రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం బి-బ్లాక్ అధ్యక్షుడు సానెం శ్రీనివాస్‌రెడ్డి, నార్సింగి మార్కెట్ కమిటి మాజీ చైర్మెన్ ఇఎన్ అశోక్ కుమార్, ప్రమోద్‌రెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ అధ్యక్షుడు డి.రమేష్ ముదిరాజ్, మస్న వెంకటేష్, సామ ఇంద్రపాల్‌రెడ్డి, రాజేష్ నాయుడు, కావటి వెంకటేష్, అరుణ్ ముదిరాజ్, బొల్ల వెంకటేష్, ఇఎస్ రామకృష్ణ, మైసిరెడ్డి, రాజేష్ షిండే ఉన్నారు.
అధికార యంత్రాంగం హడావుడి
డెంగ్యూ విషజ్వరంతో రాజేంద్రనగర్ సర్కిల్ పద్మశాలిపురం బస్తీలో యువకుడు మృతిచెందడంతో అధికార యంత్రాంగం మంగళవారం తెల్లవారుఝాము నుంచి హడావుడి చేస్తూ బస్తీలో పని చేశారు. సర్కిల్ ఉప కమిషనర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బంది బస్తీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఫాగింగ్ చేసి, కుప్పలుగా పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లారు.
నవీన్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రేమ్‌దాస్‌గౌడ్
నవీన్ కుటుంబాన్ని మాజీ కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్ మంగళవారం పరామర్శించారు. అధికారుల అలసత్వం, నిర్లక్ష్యంతోనే డెంగ్యూ వ్యాధి ప్రబలిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం తప్పు లేదని, అధికారుల నిర్లక్ష్యంతోనే డెంగ్యూ ప్రబలిందని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిందలు వేయడం సముచితం కాదని, ఓదార్చాల్సింది పోయి రాజకీయం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

నిరుపయోగమైన బోరుబావులను మూసివేయాలి
* కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి విజ్ఞప్తి
శేరిలింగంపల్లి, జూన్ 27: నిరుపయోగంగా ఉన్న బోరుబావులను తక్షణమే మూసివేయాలని చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి కోరారు. మంగళవారం చందానగర్ డివిజన్‌లోని న్యూ శంకర్‌నగర్‌లో ఉపయోగంలో లేని బోర్‌వెల్‌ను గమనించిన కార్పొరేటర్ వెంటనే దానిపై సంచీని కప్పి బండరాయి పెట్టారు. డివిజన్ పరిధిలో ఎక్కడైనా వాడకంలో లేని బోర్లను వెంటనే మూసివేసి రక్షణ కంచె ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా బోర్‌బావి ప్రమాదకరంగా కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జిహెచ్‌ఎంసి అధికారులకు సమాచారం ఇవ్వాలని, తన దృష్టికి తెచ్చినా వెంటనే చర్యలు తీసుకుంటానని కార్పొరేటర్ నవతారెడ్డి తెలిపారు. ఇందులో కాలనీ నాయకులు ఉమామహేశ్వరరావు, సత్యనారాయణరెడ్డి, పార్థసారధి, రామకోటేశ్వరరావు, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీహరి, ఆంజనేయులు, టిఆర్‌ఎస్ నాయకులు చందర్‌రావు, పోచయ్య, సులోచన, సంధ్య పాల్గొన్నారు.

ప్రజలకు అందుబాటులో కార్యాలయాలు ఉండాలి
* కొత్తూరు ఎంపిపి శివశంకర్‌గౌడ్
కొత్తూరు రూరల్, జూన్ 27: ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ కార్యాలయాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కొత్తూరు ఎంపిపి శివశంకర్‌గౌడ్ అన్నారు. మంగళవారం కొత్తూరు విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలను హైదరాబాద్‌కు తరలించడం విడ్డూరంగా ఉందని అన్నారు. కొత్తూరు, నందిగామ మండలాలకు సంబంధించిన ఎస్‌టిఓ లావాదేవీలను రంగారెడ్డి జిల్లా ఎస్‌టిఓ కార్యాలయాలకు అనుసంధానం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోను తక్షణమే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రెండు మండలాలకు సంబంధించి ఎస్‌టిఓ కార్యాలయం ద్వారా జరిపే లావాదేవీలను జిల్లా ట్రెజరీ ద్వారా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవోను విడుదల చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. పశుసంవర్థక శాఖ ఎడి కార్యాలయాన్ని జిల్లాల పునర్విభజనలో భాగంగా హైదరాబాద్‌కు తరలించారని గుర్తు చేశారు. అదే తరహాలోనే మిగితా ప్రభుత్వ కార్యాలయాలకు ఒక్కొక్కటిగా తరలించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. రెండు మండలాలకు సంబంధించిన ఎస్‌టిఓ లావాదేవీలను షాద్‌నగర్ ట్రెజరీ కార్యాలయం ద్వారా కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.