రంగారెడ్డి

26 నుంచి మాణిక్య జ్ఞాన యజ్ఞం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 24: వికారాబాద్ పట్టణంలోని శ్రీరామమందిరంలో ఈనెల 26 నుండి 28వ తేదీ వరకు నిర్వహించబడే శ్రీగురు అవధూత మాణిక్య జ్ఞాన యజ్ఞాన్ని భక్తులు జయప్రదం చేయాలని ప్రభు భక్త బృందం కోరింది. శుక్రవారం స్థానిక శ్రీరామమందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మూడు రోజుల పాటు ఉదయం 9 గంటలకు ప్రభువుల శ్రీ చక్రార్చన యుక్త నిత్యపూజ, రుద్రాభిషేకం, 10 గంటలకు అనుగ్రహ భక్తుల స్వగృహంలో ప్రభు పాదపూజ, సాయంత్రం 6.30 గంటల నుండి భగవద్గీత శ్లోకార్థాలపై మహరాజు ప్రవచనం, రాత్రి 9 గంటలకు హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ ఉంటాయని చెప్పారు. జ్ఞాన యజ్ఞానికి హుమ్నాబాద్‌కు చెందిన పరమ పూజ్య శ్రీజ్ఞాన్‌రాజ్ మాణిక్యప్రభు మహరాజ్ మొదటిసారిగా వికారాబాద్‌కు వస్తున్నారని తెలిపారు. విద్య, వ్యాపార కేంద్రంగా అభివృద్ది చెందిన వికారాబాద్ అనంతగిరి శ్రీఅనంత పద్మనాభస్వామి ఆశీస్సులతో ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోందని పేర్కొన్నారు. సమావేశంలో ప్రభు భక్త బృందం సభ్యులు కృష్ణపంతులు, శ్రీరామమందిరం కమిటి చైర్మన్ సింగారపు మాణిక్యం, ప్రముఖ వ్యాపారులు మోనిగారి నారాయణ, యాస్కి కిష్టయ్య, పోకలసతీష్, నాగరాజు, న్యాయవాదులు పి.గోవర్ధన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, చౌదరి యాదవరెడ్డి, మాధవరెడ్డి, వికారాబాద్ ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు రఘునందం పాల్గొన్నారు.