రంగారెడ్డి

రవాణాశాఖ రెవెన్యూ పెంచేందుకు కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూలై 1: రవాణాశాఖ రెవెన్యూ రాబడి పెంచేందుకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని డిప్యూటి ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డిటిసి) ఎం.ప్రవీణ్‌రావు సూచించారు. శుక్రవారం పేట్‌బషీరాబాద్ ప్రాంతంలోని మేడ్చల్ ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించారు. అధికారిక పని మీద విచ్చేసిన ఆయన పలు విషయాలపై ఆరా తీశారు. అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఇన్స్‌పెక్టర్లు రవాణా రెవెన్యూ రాబడి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని రాబడి ఆశించిన స్థాయిలో లేదన్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా పత్రాలు సక్రమంగా లేని సీజ్ చేసిన వాహనాలను బస్సు డిపోలలో, పోలీసు స్టేషన్‌లలో పార్కింగ్ చేయడం కంటే ఎక్కడన్న ఖాళీ ప్రభుత్వ స్థలం ఉంటే దానిని ప్రభుత్వ అనుమతితో అధీనంలోకి తీసుకుని అక్కడ పార్కింగ్ చేస్తే బావుంటుందని సూచించారు. ఈ నెల 11న రాష్టవ్య్రాప్తంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆర్టీఓ కార్యాలయ ఆవరణలో విధిగా 200 మొక్కలు నాటాలని ఆదేశించారు. కార్యాలయానికి ప్రహరీగోడ గోడ లేకపోవడంతో తరచూ సీజ్ చేసిన వాహనాలు వాటి పరికరాలు చోరీకి గురవుతున్నాయని డిటిసి దృష్టికి తీసుకువచ్చారు. ఎన్‌సిఎల్ సింధూజ కన్స్‌ట్రక్షన్ కంపెనీకి చెందిన హెచ్‌ఆర్ మేనేజర్ కనక లింగేశ్వర్‌రావు డిటిసిని కలిసి తమరు అనుమతిస్తే 100/20 పీట్ల ప్రహరీగోడను ఉచితంగా నిర్మించి ఇస్తామని వివరించారు. స్పందించి అనుమతిని మంజూరు చేశారు. కార్యక్రమంలో మేడ్చల్ ఆర్టీఓ పి.పురుషోత్తం, ఎంవిఐలు ఎర్రి స్వామి, సాదుల శ్రీనివాస్, చంద్రశేఖర్, ఎఎంవిఐలు బోధిశ్రీ, శంకర్‌నారాయణ్, శ్రీనివాస్‌రెడ్డి, ఎఓలు నీల్‌విక్టర్, ఎం.రవీందర్ పాల్గొన్నారు.