రంగారెడ్డి

బార్‌ట్రానిక్స్ కంపెనీలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఏప్రిల్ 14: మేడ్చల్ మండలం రాజబొల్లారం పరిధిలోని బార్‌ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో సుమారు కోటి రుపాయలకుపైగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఎస్‌ఐ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం రాజబొల్లారం గ్రామ పరిధిలో గల బార్‌ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో సిమ్ కార్డులు తయారవుతాయి. కాగా గురువారం సాయంత్రం 6గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. షాక్ సర్య్కూట్‌తో ప్రమాదం సంభవించిందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. చిన్న పాటి విద్యుత్ ప్రమాదం పెద్దదిగా మారి ఉవ్వెత్తున మంటలు చెలరేగి అగ్నికీలకలు చుట్టుముట్టాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చేంత వరకు జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమారు 300 వరకు కంప్యూటర్లు, సర్వర్లు, విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. కోటి రూపాయలకుపైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రమద సమయంలో ఉద్యోగులు పని చేస్తున్నప్పటికీ ఎవరికీ ఏమికాలేదు. అగ్నిమాపక సిబ్బంది ఎంతో కష్టపడి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. కావాల్సినంత నీరు అందుబాటులో లేకపోవడంతో నీటి ట్యాంకర్లతో నీరు తెప్పించి ఎంతో శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేయడంలో కృతకృత్యులయ్యారు.