రంగారెడ్డి

దేశవ్యాప్త సమ్మె విజయవంతం కోసం సత్యాగ్రహ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఆగస్టు 9: కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యితిరేకంగా సెప్టెంబర్ 2న నిర్వహించే దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ఉప్పల్ పారిశ్రామికవాడలో ఒక్క రోజు సత్యాగ్రహం దీక్షను నిర్వహించారు. సిఐటియు కార్యదర్శి జె.వెంకన్న అధ్యక్షతన జరిగిన దీక్షలో హెచ్‌ఎంఎస్ నుంచి పి.నర్సయ్య, రవీందర్‌రెడ్డి, ఏఐటియుసి నుంచి పరమేశ్, రాంనారాయణ, సిఐటియు నుంచి వెంకటేశ్వర్లు, సిద్దులు, ఐఎఫ్‌టియు నుంచి లక్ష్మీ, రాజమణి, టిఆర్‌ఎస్‌కెవి నుంచి సంపత్‌కుమార్ పాల్గొని దీక్షకు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. దీక్షా శిబిరాన్ని ప్రారంభించిన సిఐటియు రాష్ట్ర నాయకుడు ఎస్.నర్సింహారెడ్డి మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని, కార్మిక చట్ట సవరణల పేరుతో అన్యాయం చేయొద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఆదినారాయణ, కరుణ కుమారి, నర్సింహ గౌడ్, భీష్మాచారి, గుప్త, ప్రసాద్, మల్లిఖార్జున్ పాల్గొన్నారు.