రంగారెడ్డి

ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఆగస్టు 27: మేడ్చల్ నగర పంచాయతీ పరిధిలో కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు పూర్తిగా నిషేధించేలా ప్రజాప్రతినిధులు ఆయా పార్టీల నాయకులు వారికి అవగాహన కలిపించి చైతన్యపర్చాలని కమిషనర్ రామిరెడ్డి కోరారు. శనివారం నగర పంచాయతీ కార్యాలయంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు పొదుపుసంఘాల పట్టణ సమాఖ్య సభ్యులతో పాటు సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలు కలుషితం కాకుండా ప్లాస్టిక్ వాడకానికి చరమగీతం పాడాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ బ్యాగులు, ఫ్లెక్సీల వాడకాన్ని నిషేధించాలని భావిస్తోందని అందుకు అందరూ పూర్తిగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టే విధంగా భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రజలకు అవగాహన కలిపించాలని సూచించారు. ఈ అంశాలను సామాజిక బాధ్యతగా భావించి ప్రజలను ఆ దిశగా అమలు చేసే విధంగా చైతన్యం చేయాలని కమిషనర్ విఙ్ఞప్తి చేశారు.