రంగారెడ్డి

మెడికల్ టూరిజంకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, సెప్టెంబర్ 3: మెడికల్ టూరిజంకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత కల్పించి రాష్ట్రానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు పర్యాటక శాఖ ఎప్పుడు సిద్ధంగా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ సెక్రటరీ బి. వెంకటేశం అన్నారు. అంతర్జాతీయ ఇండియా వైద్య పర్యాటక 3వ సదస్సును శామీర్‌పేటలోని లియోనియా క్లబ్‌లో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ కేవలం పర్యాటక శాఖ కాకుండా ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పర్యాటకులకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేసే బాధ్యత తాము తీసుకుంటామని చెప్పారు. అత్యంత పురాతన నగరాల్లో హైదరాబాద్ ఒకటని ఇక్కడి సంప్రదాయపు వంటకాల రుచులను ఆస్వాదించడమే కాకుండా అనేక పురాతనమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయని చెప్పారు.
అంతర్జాతీయంగా తెలంగాణకు ఎంతో పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయని వీటిని దృష్టిలో పెట్టుకొని పర్యాటకులకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పర్యాటకులు విమానాల్లో ప్రయాణించేటప్పుడు అత్యవసర వైద్య సేవలను కూడా అందిస్తున్నట్లు వెంకటేశం గుర్తు చేశారు. ఇటీవల మహిళా పర్యాటకురాలు ప్రసవ వేధనతో బాధపడుతుండగా ఆమెకు అతి సులువుగా ప్రసవం చేసిన ఘనత తెలంగాణ పర్యాటక శాఖకు దక్కిందని అన్నారు. నిజాం కాలం నాటి వంటకాల రుచులు కొంత మేరకు ఘాటుగా ఉన్నప్పటికీ సందర్శకుల కోరికల మేరకే ఆ రుచులను అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అమెరికా, యుకె, జర్మనీ, మిడిల్ ఈస్ట్ దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. రెండురోజుల పాటు జరగునున్న ఈ సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని తమ సలహాలు, సూచనలను అందించనున్నారు.