రంగారెడ్డి

ఉద్యమంలో పాల్గొన్న వారికే పదవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, అక్టోబర్ 2: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికే పదవులు లభిస్తున్నాయని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ఆదివారం గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణా స్వీకారం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్వామిగౌడ్ మాట్లాడుతూ ముందు నుంచి పత్తి ప్రవీణ్‌కుమార్ ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గుర్తించి నేడు గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ చైర్మన్ పదవిని ఇచ్చారని గుర్తుచేశారు. ఉద్యమంలో పాల్గొన్న వారందరిని కెసీఆర్ గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. మార్కెట్‌ను వేగవంతంగా అభివృద్ది చేసుకోవాలని పిలుపు నిచ్చారు. స్థానికంగా ఉన్న నాయకులకు మార్కెట్ కమిటీలో చోటు లభించేవిధంగా మంత్రి దృష్టికి తీసుకెళ్తామని స్వామిగౌడ్ పేర్కొన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో మార్కెట్‌లు వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి మార్కెట్‌కు రెండు కోట్లు రూపాయాలతో పలు అభివృద్ది కార్యక్రమాల కోసం కేటాయించారని తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మిషన్ కాకతీయతో జిల్లాలోని అన్ని చెరువుల నిండుతున్నాయని ఆరోపించారు. మార్కెట్ నూతన కమిటీ చైర్మన్ పత్తి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మార్కెట్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. దళారుల చేతిలో రైతులు మొసపోకుండా చూస్తానని పేర్కొన్నారు. చైర్మన్‌గా పత్తి ప్రవీన్‌కుమార్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, సభ్యులు అనంతరెడ్డి, రాజేందర్ కుమార్, వెంకట్‌రెడ్డి, నర్సంహ్మలు, శ్రీనివాస్‌గౌడ్, యాదగిరి, సయ్యద్ గౌస్, బి.శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు యాదవ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్, యాదయ్య, జిల్లా సహాకార బ్యాంక్ వైస్ చైర్మన్ ఎ.మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, రాజేంద్రనగర్ మండల ఎంపిపి తలారి మల్లేష్ పాల్గొన్నారు.