రంగారెడ్డి

గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 30: తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో 2016-17 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మండల విద్యాధికారి వెంకట్‌రెడ్డి తెలిపారు. గురుకులంలో ప్రవేశానికి మే 5 నుండి 7 వరకు మూడు రోజుల పాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. జిల్లాలో బాలురకు బాల్‌నగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, వికారాబాద్, పరిగి, బాలికలకు రాజేంద్రనగర్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, తాండూర్‌లలో కొత్తగా పాఠశాలలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. వీటిల్లో ప్రవేశానికి గానూ విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు వివరించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేవారు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని మరిన్ని వివరాలకు 04033640000, 731170780/82/83 ఫోన్‌నెంబర్లను సంప్రదించాలని కోరారు.