రంగారెడ్డి

ప్రజా సంక్షేమమే టిఆర్‌ఎస్ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, నవంబర్ 21: ప్రజా సంక్షేమమే టిఆర్‌ఎస్ సర్కార్ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి పెర్కోన్నారు. సోమవారం మేడ్చల్ పట్టణంలోని రైతుబజార్‌లో ప్రభుత్వం తరఫున రాయితీపై అందిస్తున్న ఉల్లి విక్రయ కేంద్రాన్ని ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఉల్లి దెబ్బకు జనతా ప్రభుత్వం పడిపోయిందని గుర్తుచేశారు. పెరిగిన ధరలను నియంత్రణలో పెట్టేందుకు ప్రభుత్వం రాయితీపై ఉల్లి విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తున్నదని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అందరిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని పేర్కొన్నారు. నోట్ల రద్దుపై బిజెపి నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని, ఓ మంత్రి ఒకటి చెబితే మరో మంత్రి మరోటి చెప్తున్నారని కేంద్ర మంత్రుల మధ్యనే నోట్ల రద్దుపై సయోధ్య లేకుండా పోయిందన్నారు. పేదల సంక్షేమం కోసం పాటు పడే ప్రభుత్వాలే నాలుగు కాలాల పాటు నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు కారణంగా రాష్ట్ర వనరులన్నీ దెబ్బతింటున్నాయని వివరించారు. నల్ల కుబేరుల జాబితా బయటపెట్టాలని కోరారు. నోట్ల రద్దుతో ఇంత లాభం చేకూరిందని ప్రజలకు వివరించాలని అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి అందరు పాటుపడాలని సూచించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని మార్కెట్ కమిటీ పాలకవర్గం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో ఎంపిపి విజయలక్ష్మీ, జడ్పీటిసి శైలజ హరినాథ్, ఎఎంసి వైస్ చైర్మన్ నాగరాజు, డైరెక్టర్లు లింగా కృష్ణమూర్తిగుప్త, సంతోష్‌కుమార్, ముత్యంరెడ్డి, అంజయ్యకుమార్ గౌడ్, కార్యదర్శి అపర్ణ, తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపిడిఓ దేవసహయం, నగర పంచాయతీ కమిషనర్ రామిరెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు భాస్కర్ యాదవ్, మల్లికార్జున్, విష్ణుచారి, రాంరెడ్డి, సాటే నరేందర్, రఘుగౌడ్, శేఖర్‌గౌడ్, మోహన్‌రెడ్డి, నర్సింహ్మరెడ్డి, నాగరాజు, తోట వసంత, రవీందర్, శారద, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.