రంగారెడ్డి

విత్ డ్రా పేరుతో బ్యాంక్ ఎండి మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయిగూడ, డిసెంబర్ 2: చెక్కులు డ్రా చేస్తానని చెప్పి తీసుకున్న బ్యాంక్ ఎండి ఆ మొత్తాన్ని ఖాతాదారుకు ఇవ్వకుండా తానే డ్రా చేసుకున్న ఉదంతం ఇది. ఏఎఎస్‌రావునగర్ నవభారత్ బ్యాంకులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎఎస్‌రావునగర్‌కు చెందిన సుడుగు మహేందర్‌రెడ్డి నవభారత్ ప్రైవేట్ బ్యాంకులో బామ్మర్ది పెళ్ళి కోసం లక్ష రూపాయలు డిపాజిట్ చేశాడు. డిపాజిట్ చేసిన డబ్బులను తిరిగి విత్‌డ్రా తీసుకోవడానికి రెండు సెల్ఫ్ చెక్కులను ఇవ్వాలని నవభారత్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పాండురంగారావు కోరారు. రెండు సెల్ఫ్ చెక్కులను ఇచ్చిన మహేందర్‌రెడ్డి వారంరోజులు కావస్తున్నా తిరిగి చెక్కులు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి బ్యాంకుకు వెళ్ళి ఆరాతీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బులను నవంబర్ 27 విత్‌డ్రా చేసుకున్నట్టు తేలింది. బ్యాంకులో ఉన్న రెండు సెల్ఫ్ చెక్కులను తీరిగి ఇవ్వలని బ్యాంకు మేనేజర్ పాండురంగారావు చూట్టు తిరిగినా ఇవ్వకుండా లక్ష రూపాయలు విత్‌డ్రా చేసుకున్నాడని తెలిపారు. సెల్ఫ్ చెక్కులతో మోసం చేసి నవభారత్ బ్యాంకు మేనేజర్‌పై కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు మహేందర్‌రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి బ్యాంకు ఎండిపై చర్యలు తీసుకుంటామని సిఐ వెంకటరమణ తెలిపారు.