కృష్ణ

ఆన్‌లైన్‌లో భవన నిర్మాణాలకు అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 28: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలో భవన నిర్మాణ అనుమతులను పారదర్శకంగా మరియు త్వరితగతిన మంజూరు చేయడమే కాకుండా నిర్మాణ కార్యక్రమాలను ప్రోత్సహించే విధంగా వినూత్న పద్ధతులకు ఎపిసిఆర్‌డిఎ శ్రీకారం చుట్టింది. ఏవైనా అనుమతులు, సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం ఓపెన్ ఫోరం, డెవలపర్లకు, భవన నిర్మాణ దారులకు ప్రాజెక్టు అమలుపై అవగాహన, తగిన సలహాలతో తోడ్పాటు అందించేందుకు ప్రతి శనివారం డెవలప్‌మెంట్ ఫెసిలిటేషన్ సెంటర్ నిర్వహిస్తున్న ఎపిసిఆర్‌డిఎ ఆన్‌లైన్ పద్ధతిలో భవన నిర్మాణ దరఖాస్తుల స్వీకారానికి శ్రీకారం చుట్టింది. కొత్తగా చేపట్టిన ఆన్‌లైన్ దరఖాస్తుల విధానంపై అవగాహన కల్పించేందుకు ఎపిసిఆర్‌డిఎ బుధవారం నాడు భవన నిర్మాణదారులు, లైసెన్స్‌డ్ సర్వేయర్లు, ప్లానర్లు, క్రస్టక్చరల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్టులకు వర్క్‌షాప్ నిర్వహించింది. ఎపిసిఆర్‌డిఎ డెవలప్‌మెంట్ కంట్రోల్ విభాగం ప్రస్తుతం డెవలప్‌మెంట్ మోషన్ విభాగంగా మారిందని కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు.
ప్రస్తుతం భవన నిర్మాణాలకు సంబంధించి మాత్రమే ఆన్‌లైన్ దరఖాస్తు విధానం అమలు చేస్తున్నామని 3 నుంచి 4 వారాల్లో లే అవుట్ పర్మిషన్ దరఖాస్తులను కూడా ఆన్‌లైన్‌లో స్వీకరించేలా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఆర్కిటెక్టులు, లైసెన్డ్ ప్లానర్లు తప్పులు చేయకుండా నిబంధనల ప్రకారం దరఖాస్తు చేయాలని, తప్పులు చేస్తే దానికి తగిన కఠిన చర్యలు ఉంటాయని, లైసెన్స్ రద్దు చేయడంతో పాటు, అతని ఫొటో వెబ్‌సైట్‌లో పెడతామని, క్రిమినల్ కేసు నమోదు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. ఇప్పటికే ఎపిసిఆర్‌డిఎ పరిధిలో 15 రోజుల్లో 300 ఎకరాల్లో అనుమతి లేని లేఅవుట్‌లు తొలగించామని, 30 అక్రమ నిర్మాణాలు కూల్చివేశామని చెప్పారు. ప్రాపర్టీ డెవలప్‌మెంట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లు, ప్లానర్లకు భవన నిర్మాణదారులకు ఎపిసిఆర్‌డిఎ అనుసంధాన కర్తగా ఉంటుందన్నారు.

ఉనికి కోసమే జగన్ విమర్శలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 28: వర్ష ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను సత్వరం ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 మంది ఐఎఎస్‌లు, 40 మంది డెప్యూటీ కలెక్టర్లు, వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారన్నారు. యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు, విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో దేశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచిపేరు ఉందన్న విషయాన్ని విషయాన్ని ప్రతిపక్ష నేత జగన్ గమనించాలన్నారు. వర్షాలు పడ్డ ఆరు రోజులకు జగన్ రాజకీయ పర్యటనలు చేస్తున్నారని, ఉనికి కోసం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా జగన్ ఇష్టానుసారం బురదజల్లుతున్నారని, ప్రభుత్వంపై విద్వేషం వెళ్లగక్కడాన్ని జగన్ మానుకోవాలన్నారు. వైద్యం, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలను అప్రమత్తం చేసి ప్రజలకు సకాలంలో మెరుగైన సేవలందించడం జరిగిందన్నారు.