జాతీయ వార్తలు

రాజ్యసభలో ‘అరుణాచల్’ రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గవర్నర్ పాత్రపై చర్చకు కాంగ్రెస్ డిమాండ్ నినాదాలతో హోరు.. సభ వాయిదా

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: అరుణాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచటానికి బిజెపి పన్నిన కుట్రను అమలుచేయటంలో కీలకపాత్ర వహిస్తున్న గవర్నర్‌పై చర్చకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభను అడ్డుకున్నారు. సభ కొంతసేపు సజావుగా జరిగిన తరువాత కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చి గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ ప్రభుత్వం గవర్నర్‌ను పావుగా ప్రయోగించి తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తోందని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ పాత్రపై చర్చించటానికి ఇచ్చిన నోటీసు చైర్మన్ పరిశీలనలో ఉందని డిప్యూటీ చైర్మన్ పదే పదే గుర్తుచేసినా లాభం లేకపోయింది. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ గవర్నర్ పాత్రపై చర్చించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. అయితే నియమ నిబంధనలకు విరుద్ధంగా చర్చను చేపట్టటం మాత్రం సాధ్యపడదని స్పష్టం చేశారు. గతంలో రామ్‌లాల్, చెన్నారెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చటంలో కీలకపాత్ర వహించారని అనేకమంది సభ్యులు గుర్తుచేశారు. రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న గవర్నర్‌పై చర్య తీసుకోవాలని వివిధ పార్టీల సభ్యులు సభ్యులు చేశారు. నినాదాల హోరుతో సభ మార్మోగిపోయింది. కాంగ్రెస్ సభ్యులను శాంతింప చేయటానికి డిప్యూటీ చైర్మన్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు.