ఆంధ్రప్రదేశ్‌

ఏకాత్మతా మానవ దర్శనమే దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్యాంప్రసాద్

అనంతపురం , డిసెంబర్ 10: పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రూపొందించిన ఏకాత్మతా మానవ దర్శనం ప్రపంచ దేశాలకు దిక్సూచి అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) క్షేత్ర ప్రచారక్ ఏలె శ్యాంకుమార్ అన్నారు. ప్రపంచంలో పుట్టుకొచ్చిన అనేక సిద్దాంతాలు విఫలమయ్యాయని, అయితే ఏకాత్మతా మానవ దర్శనం శ్రేష్ఠమైందని పేర్కొన్నారు. జన్‌సంఘ్ వ్యవస్థాపకులు పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి ఉత్సవాలను అనంతపురం నగరంలో గురువారం ప్రారంభించారు. బిజెవైఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్యాంకుమార్ మాట్లాడుతూ నేడు ప్రపంచ దేశాలు, దేశంలోని ప్రజలందరూ ఏకాత్మతా మానవ దర్శనం వైపు చూస్తున్నారని అన్నారు. దేశంలో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్న సమయంలో జన్‌సంఘ్‌ను స్థాపించి దేశ ఆర్థిక, సామాజిక స్థితిగతులను బాగుపరిచిన మహోన్నత వ్యక్తి పండిత్ దీన్‌దయాళ్ అని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని నదురాచంద్రబాక అనే మారుమూల గ్రామంలో 1916లో జన్మించిన దీన్‌దయాళ్ ప్రస్తుత రాజకీయాలకు మార్గదర్శకులుగా, వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పిన గొప్ప వ్యక్తిగా నిలిచారన్నారు. విద్యార్థి దశంలోనే ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం పట్ల ఆకర్షితులై సంఘ్‌లో అంచలంచెలుగా ఎదిగి అందరికీ మార్గదర్శకులుగా నిలిచారన్నారు. యవ్వనం మనస్సుకు సంబంధించిందని, వేషం కన్నా గుణం ముఖ్యమని దీన్‌దయాళ్ చాటారన్నారు. కుటీర పరిశ్రమలు స్థాపించి భవిష్యత్ తరాలవారికి జీవనోపాధి కల్పించారని తెలిపారు. దీన్‌దయాళ్ స్థాపించిన జన్‌సంఘ్ పార్టీలో చేరి శిక్షణ పొందిన వారే ప్రస్తుతం దేశానికి ప్రధానిగా కొనసాగుతున్నారన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో నీతి, నిజాయితీ లేవన్నారు. ఆ నిజాయితీ తీసుకరావాలంటే రాజకీయాల్లో మార్పులు అవసరమన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ నిరాడంబర జీవితాన్ని, నీతివంతమైన జీవితాన్ని గడిపారన్నారు. దీన్ దయాళ్ జీవితంలో ప్రతి సంఘటన కార్యకర్తల్లో వికాసాన్ని పెంపొందిస్తుందన్నారు. ప్రధాని మోదీ ప్రజలకు ఉపయోగపడే పలు సంక్షేమ పథకాలను ప్రారంభించి వారి మన్ననలు పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సి.విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.