ఆంధ్రప్రదేశ్‌

రాజ్యసభకు ప్రముఖుల నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. బిహార్‌లో సోమవారం నాడు ఆర్‌జెడి తరఫున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ, జెడియు నుంచి శరద్ యాదవ్, ఆర్‌జెడి అభ్యర్థిగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి నామినేషన్లు వేశారు. పంజాబ్ నుంచి కాంగ్రెస్ నాయకురాలు అంబికాసోనీ నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు జరిగే రెండు సీట్లకు అధికార తెరాస పార్టీ ఇప్పటికే డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులను ఎంపిక చేసింది. సంఖ్యాబలం లేనందున రాజ్యసభ ఎన్నికలకు తాము దూరంగా ఉంటున్నామని టి.కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఎపిలో వైకాపా తరఫున విజయసాయిరెడ్డి రెండు రోజుల క్రితమే నామినేషన్ వేశారు. టిడిపి అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఈరోజు ఉదయం నుంచీ పలువురు నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు. కొంతమంది తెలంగాణ టిడిపి నేతలు సైతం ఎపి నుంచి రాజ్యసభకు వెళ్లాలని ఆశపడుతున్నారు. మిత్రపక్షమైన బిజెపికి ఒక సీటు ఇస్తే ఇక టిడిపి నుంచి ఇద్దరు మాత్రమే రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉంది.