తెలంగాణ

మంత్రి కారును అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కారును ఆర్టీసీ కార్మికులు అడ్డగించారు. సత్యవతి రాథోడ్ భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి దర్శనానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు మంత్రి కారు వెళ్లకుండా అడ్డంగా పడుకోవడంతో పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మంత్రి కారుకు అడ్డంగా ఉన్న కార్మికులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు మరో మార్గం ద్వారా సత్యవతి రాథోడ్‌ను ఆలయంలోకి తీసుకెళ్లారు.