రుచి

పోషక విలువలున్న నిమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజా నిమ్మపండ్లలో పోషక విలువలు మెండుగా వున్నాయి. నిమ్మపండులో సి విటమిన్ వుంది. జీర్ణశక్తికి బహుళ ప్రయోజనకారి. నిమ్మరసం దాహానికి చక్కగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నిమ్మరసం రోజూ పరగడుపు త్రాగేవారికి జీర్ణశక్తి బాగా వుంటుంది. స్ర్తిలకు శరీర కాంతినిస్తుంది. నిమ్మరసం వృద్ధులకు ఉపశమనం కలిగిస్తుంది. నీరసంగావున్నవారికి కాస్తంత ఉత్సాహం కలిగిస్తుంది.
స్ర్తిలు స్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీటిలో రెండు చుక్కలు నిమ్మరసం కలుపుకుని స్నానం చేస్తే శరీరం తాజాదనంతో నిగనిగలాడుతుంది.
రాయలసీమ ప్రాంతవాసులు పులిహోర వంటకంలో నిమ్మకాయలు ఉపయోగిస్తారు. తాజా నిమ్మపండులో సమృద్ధిగా విటమిన్లు ఉన్నాయి. ఆయుర్వేద శాస్త్రంలో నిమ్మ ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది.
అమ్మవారి పూజలకు, జాతరలకు నిమ్మపండ్లు ఉపయోగిస్తారు. ‘నిమ్మ’ మహిమ కలదంటారు.
నిమ్మరసం ఆకలిని పెంచుతుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. మజ్జిగలో నిమ్మ ఆకులు వేస్తే మంచి సువాసనతో మజ్జిగ బావుంటుంది. నిమ్మకాయలు సాధారణంగా అన్ని కాలాలలోను లభిస్తుంది. అనేక రకాల సుగుణాలు నిమ్మకాయలో వున్నాయి. మనం వాడేసిన నిమ్మతొక్కలను బాగా ఎండబెట్టి వాటిని మిక్సీలో వేసి పొడి చేసి దానిని సెనగపిండి కొంచెం నిమ్మరసం కలిపి పేస్టు చేసి స్ర్తిలు తమ ముఖానికి రాసుకుని పది నిముషాలు అయ్యాక ముఖం కడుక్కుంటే మరింత తాజాదనంతో ప్రకాశిస్తారు.
గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె రెండు స్పూన్ల నిమ్మరసం కలుపుకుని తాగితే కఫం పోతుంది. నిమ్మలో పోషక విలువలుతోబాటు ఔషధ గుణాలు అధికంగా వున్నాయి.

-ఎల్.ప్రపుల్లచంద్ర