రుచి

నెయ్యి కమ్మటి వాసన రావాలంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెన్నను కరిగించేటప్పుడు నెయ్యిని కిందకుదించబోయేముందు ఒక చెంచా మజ్జిగను దానికి కలిపి చూడండి. నెయ్యి మరింత కమ్మని వాసన వస్తుంది. వెనె్న కాచేటప్పుడు తాజా బంగాళా దుంప ముక్కను వేస్తే నెయ్యి సువాసనా భరితంగా వుంటుంది. నెయ్యి కాచిన గినె్నలో రెండు గ్లాసుల నీరు పోసి మరగనివ్వండి. ఆ తరువాత ఈ నీరు పోసి అన్నం వండితే రుచికి రుచి, పొదుపు అవుతుంది. వేసవిలో పాలు విరిగిపోకుండా వుండాలంటే పాలల్లో కొద్దిగా ఏలకుల పొడిని కలిపి చూడండి.
పాలు పొంగుకు వచ్చాక పావు గంటపైగా సన్నని మంటపై మరిగిస్తే పాలు విరిగిపోకుండా వుంటాయి. ఫ్రిజ్ లేనప్పుడు పాలు విరిగిపోకుండా వుండాలంటే కాచి చల్లార్చిన తర్వాత వాటిని ఒక సీసాలో పోసి మూత గట్టిగా బిగించి తడిబట్ట చుట్టి ఉంచండి.
పాలు ఎక్కుసేపు నిల్వ ఉంచాలంటే లీటరు పాలకు చెమ్చా పంచదార, చిటికెడు తినే సోడా వేస్తే పాలు విరగవు. పాలలో పుదీనా ఆకులు వేస్తే విరగవు. రాత్రి నిలువ వున్న పాలు తెల్లవారేసరికి విరగకుండా వుండాలంటే బక్కెట్‌లో కొద్దిగా నీళ్ళు పోసి గినె్నను అందులో పెడితే సరిపోతుంది. పాల గినె్న చల్లని నీళ్లలో సగం మునిగితే చాలు.
వేడి వేడిగా పాలను అలాగే ఫ్రిజ్‌లో పెట్టకూడదు. బాగా చల్లారనిచ్చిన తర్వాత పెట్టాలి. పాలు తాగే పిల్లలుంటే మరిగినపాలు చల్లారకముందే వేరే ఫ్లాస్క్‌లో వుంచితే వాళ్ళు ఎప్పుడు లేస్తే అప్పుడు వేడి పాలు రెడీగా వుంటాయి.
.........................................................

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- బి.విజయలక్ష్మి