సబ్ ఫీచర్

సౌకర్యాలతో పాటు రోగాలూ పెరిగాయి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత నాలుగు వందల ఏళ్ల కాలంలో పారిశ్రామిక విప్లవ ఫలితంగా అనేక రకాలైన యంత్రాలు రంగప్రవేశం చేసి ప్రపంచ సామాజిక స్వరూపానే్న మార్చివేశాయి. వీటి ఫలితంగా మనమందరం ‘అంధకార యుగం నుండి వెలుతురు యుగంలోకి చేరినట్లు’గా- రాత్రి గడిచాక పగటి వెలుగును పొందగలిగినట్టుగా ఆనందిస్తున్నాం. ఈ భావనలో అసలు రహస్యం ఏమిటంటే- రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి చక్రభ్రమణంగా నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయని. ప్రతి 5,150 ఏళ్ళకు ఒక చక్రభ్రమణం పూర్తవుతుందని, 3102లో ప్రారంభమైన కలియుగంలో మొదటి 5150 ఏళ్ళ కాలచక్రం 2048కి పూర్తి అవుతుందని అప్పటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచీన వేద ధర్మం పునః స్థాపితం అవుతుందని వ్యాస మహర్షి ‘కృత భవిష్యవాణి’ వల్ల తెలుస్తున్నది.
2048 నాటికి ప్రాచీన వేద ధర్మం ప్రపంచ వ్యాప్తంగా పునఃస్థాపితం కావడమా? అని అందరికీ ఆశ్చర్యం కలుగవచ్చు. అట్టి పరిణామాలకు దారితీసే మానసిక పరివర్తన ఇప్పటికే ఏర్పడి- ఈనాటి ప్రగతిశీలక సాధనాలైన కార్లూ, రైళ్లు, కంప్యూటర్లు, వివిధ యంత్రాలూ మానవ మేధస్సునూ, శరీరంలోని వివిధ అంగాలను క్రమంగా మందగించిపోయేట్లు, మొద్దుబారిపోయేట్లు చేస్తున్నాయన్న వాదన లేకపోలేదు. శరీరానికి వివిధ రకాల బాధలు కలిగించడానికే ఆధునిక యంత్రాలు కారకాలు అవుతున్నాయని విజ్ఞానవంతులు క్రమంగా గ్రహించగలుగుతున్నారు. ఈ పరిణామాలు త్వరలో మరో విప్లవానికి దారితీయనున్నట్లు స్పష్టం అవుతోంది.
ముందుగా కార్లు, రైళ్ల విషయం తీసుకుందాం. శరీరానికి తగినంత శ్రమ లేకపోవడంతో ఆహార వినియోగం సరిగా జరగక క్యాలరీలు పెరిగిపోతూ వివిధ రోగాలకూ దారితీస్తున్నాయనీ, అయితే- ఒక కిలోమీటరు దూరం నడవగలితే అరవై రెండు క్యాలరీలు కరిగిపోయి శరీరం ఆరోగ్యవంతం అవుతుందనీ పెద్దలు గ్రహించగల్గడం విశేషం. ఐరోపా ఖండంలో మూడు లక్షలమంది మీద జరిపిన పరిశోధనల్లో రుజువైన విషయం- ప్రతి రోజూ కనీసం 20 నిమిషాలు వేగంగా నడిచేవారికి ఆకస్మిక మరణ ప్రమాదం దాదాపు 30 శాతం వరకూ తగ్గిపోతుందని. రోజూ కొద్దిదూరం నడిచేవారికి కుంగుబాటు దరిచేరదనీ, గుండె జబ్బులు వేధించవనీ, జ్ఞాపకశక్తి మందగించదనీ స్పష్టం అయింది.
ఆధునిక కాలంలో కంప్యూటర్లతో ఎక్కువ సమయం గడిపేవారు, కుర్చీకి అంటిపెట్టుకుని అదేపనిగా పనిచేసేవారు తీవ్రమైన నడుం నొప్పికీ, వెన్నునొప్పికీ గురికావాల్సి వస్తున్నది. ఇలా బాధపడుతున్నవారు పొట్ట, కండరాలను ఒక్కసారి లోపలికి బిగపట్టి వదలడం ద్వారా ఈ నొప్పులను తగ్గించుకోవచ్చు. పాదాలలో వేలి భాగాల్ని ఎత్తి మడమ మీద ఒత్తిడి కలిగించి ఒకటి రెండు నిమిషాలు ఉంచి తిరిగి సాధారణ స్థితికి తేవడం ద్వారా నొప్పులను తొలగిపోయేట్లు చేసుకోవచ్చు. ఇవి సహజమైన శారీరక వ్యాయామాలు. నిత్య జీవితంలో భాగంగా ఈ వ్యాయామాలు ఉండగలిగేట్టయితే ఎవరికీ ఏ రోగమూ రాదు. ఈ వ్యాయామాలను నిర్లక్ష్యం చేసినపుడు వివిధాలైన రోగాలకు గురికావలసి వస్తుందని స్పష్టం అవుంతుంది.

-సన్నిధానం యజ్ఞనారాయణ మూర్తి