రుచి

వడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోధుమ రవ్వ - 2 కప్పులు
బియ్యంపిండి - 1 కప్పు
శనగపిండి - 1/2 కప్పు
అల్లం మిర్చి పేస్టు - 5 చెంచాలు
నానబెట్టిన శెనగపప్పు - 1/2 కప్పు
నూనె - 250 గ్రా.
జీలకఱ్ఱ - 2 చెంచాలు
ఉప్పు - 1 చెంచా
నూపప్పు - 1 కప్పు
విధానం: రెండు కప్పుల నీరు పోసి మరగనిచ్చి, ఉప్పు, శనగపప్పు, జీలకఱ్ఱ చేర్చి పొంగులు వస్తుండగా రవ్వ పోసి ఉడికించాలి. ఇది మెత్తగా ఉడికాక దింపి బియ్యపిండి, శెనగపిండి, అల్లం మిర్చి పేస్ట్ చేర్చి బాగా కలుపుకోవాలి. దీన్ని వడలుగా చేసుకొని నూపప్పు అద్ది లేదా ఉండల్ని నూపప్పులో ముంచి వడలుగా అద్ది కాగిన నూనెలో వేయించాలి. ఈ రవ్వ వడలు మంచి రుచిగా ఉంటాయి.