రుచి

సేమ్యా బొబ్బట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సన్న సేమ్యా - 4 కప్పులు, పంచదార - 1.5 కప్పు, ఏలకులు - 6, నెయ్యి - 5 చెంచాలు, జీడిపప్పులు - 12, మైదాపిండి - 2 కప్పులు, నూనె - 1 కప్పు, కొబ్బరికోరు - 1 కప్పు, బాదంపొడి - 2 చెంచాలు, ఉప్పు - చిటికెడు, నీరు - తగినంత

విధానము: ముందుగా బాణలిలో నెయ్యి వేసి సేమ్యాను జీడిపప్పులను దోరగా వేయించాలి. తరువాత పంచదార వేసి కొంచెం నీరు చిలకరించితే మెత్తగా ఉడుకుతుంది. ఏలకులు బాదం పొడి వేసి కలిపి ఈ ముద్దను ప్రక్కన పెట్టి చల్లార్చాలి. మైదాపిండిలో తగినంత ఉప్పు, నీరు చేర్చి ముద్దగా చేసుకోవాలి. ప్లాస్టిక్ పేపర్‌కి నూనె రాసి ఈ ముద్దను వత్తి మధ్యలో సేమ్యా ఉండ పెట్టి అంచులు మూసి ప్రక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఉండలు చేసుకున్నాక దీన్ని పలుచగా వత్తి పెనంపై కాల్చితే బొబ్బట్లు లేదా వాటిని నూనెలో వేయించితే కచోరీలు అవుతాయి.