రుచి

అటుకులతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటుకులు -
4 కప్పులు
మినప్పప్పు - 1 కప్పు
మెంతులు - 2 చెంచాలు
పెరుగు - 4 కప్పులు
ఉప్పుడు బియ్యం - 1 కప్పు
నూనె - 1/2 కప్పు
జీలకఱ్ఱ -1 చెంచా
అల్లంకోరు - 2 చెంచాలు
కొత్తిమీర - కొంచెం
నానబెట్టిన శెనగపప్పు - 1 కప్పు
కొబ్బరి - 1 కప్పు
మిర్చి - 6
విధానం: అటుకులు, మినప్పప్పు, ఉప్పుడు బియ్యం, మెంతులు పెరుగులో వేసి ఉప్పు వేసి రాత్రి నానబెట్టాలి. తెల్లారాక దీన్ని మెత్తగా మిక్సీపట్టుకుని పెట్టుకోవాలి. ఇందులో కొబ్బరి, మిర్చి అల్లం, కొత్తిమీర కలపాలి. అన్నీ కలిసిపోయేలా మరోసారి మిక్సీ పట్టి ఒక అరగంట ఉంచాలి. పెనంపై నూనె రాసి దోశెలుగా పోసుకోవాలి. కాలిన దోశెపై శెనగపప్పు అద్ది వేగాక తియ్యాలి.
ఇవి కరకరలాడుతూ పెళుసుగా వస్తాయి.ముఖ్యంగా ఈ దోశెలు చాలా బలవర్థకం. వీటిని రకరకాల చట్నీలతో తింటే రుచి అమోఘం. ఏ రకమైన దోశైనా సరే బియ్యంపిండి కలిపే వెయ్యాలి. రుచిగా కరకరలాడుతూ వస్తాయి.

- వాణి ప్రభాకరి