రుచి

పీచు పదార్థాలతో మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే పీచు పదార్థాలు మన దైనందిన ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి. జీర్ణం కాని కార్బోహైడ్రేట్స్‌నే ‘పీచు’గా వ్యవహరిస్తారు. మన జీర్ణాశయం జీర్ణించుకోలేని ఆహార పదార్థాలను పీచు పదార్థాలు అంటారు. నిజానికి పీచు చేసే మేలు ఎలాంటిదో నేటితరానికి అంతగా తెలియదు. ఇది ఆహారంలో పుష్కలంగా జీర్ణవ్యవస్థ మెరుగుపడడమే కాదు, చర్మానికి కాంతి వస్తుంది. పీచు పదార్థంలో సెల్యులోజ్, సెమీ సెల్యులోజ్, పెక్టిన్స్, లిగ్నిన్స్, గమ్స్, మ్యూకిలేజెస్, బీటా-గ్లుకేన్స్ వంటివి ఉంటాయి. వీటిని స్థూలంగా నీటిలో కరిగేవిగా, కరగనివిగా విభజిస్తారు. నీటిలో కరిగే పీచు పదార్థాలు మెత్తగా మారుతాయి. ఇవి రక్తపోటును అదుపు చేయడంలోను, గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలోను ఉపయోగపడతాయి. ఓట్స్, బీన్స్,వేరుశెనగ, ఆపిల్స్, పుల్లని పండ్లు, క్యారెట్, బార్లీలో కరిగే పీచు పదార్థాలుంటాయి.
పిండి పదార్థాలు, మాంసకృత్తులు, నూనెలు, విటమిన్లు, ఖనిజాలు.. వీటి గురించే మనం తరచూ వింటాం. నేడు వైద్య పరిశోధనలన్నీ పీచు ఆవశ్యకతను చాటి చెబుతున్నాయి. క్యాన్సర్లు, గుండెజబ్బులు, మధుమేహం, ఊబకాయం రాకుండా ఉండేందుకు ఇవి అవసరం. నూడుల్స్, పిజ్జాలు, బర్గర్లు వంటి వాటిలో పీచు ఉండదు. అందుకే ప్యాకేజీ ఫుడ్‌ను దూరంగా ఉంచాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పోషక విలువలు తక్కువగా ఉన్నప్పటికీ శరీరాన్ని అనారోగ్యాల నుంచి కాపాడటానికి పీచు పదార్థాలు దోహదపడతాయి.సాధారణంగా పీచు పదార్థాలకు మనం ఆహారంలో అంతగా ప్రాధాన్యం ఇవ్వం. ఎందుకంటే అది ఇతర పోషకాలలో కలిసే వుంటుంది. తినే ఆహార పదార్థాలలో మిగతా పోషకాలతోపాటు కొద్దిగా వుంటుంది. ఎవరూ కూడా పీచు పదార్థాలను ప్రత్యేకించి తీసుకోరు. మలబద్ధకం సమస్య లేకుండా ఉండాలంటే ఆహారంలో ఇవి ఎంతో అవసరం.
ఆహార ధాన్యాల్లో అధికం..
మనం తీసుకునే ఆహార ధాన్యాలలో కావలసినంత పీచు వుంటుంది. బియ్యం, గోధుమలు, జొన్న, పప్పులు, ఓట్స్‌లో ఇవి గణనీయంగా లభిస్తాయి. ఇవి మెగ్నీషియం, బి 6 విటమిన్‌ను కూడా ఇస్తాయి. ముతక ధాన్యాలైతే పీచు మరింత అధికంగా వుంటుంది. తెల్లని బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్, తెల్లని బియ్యం కంటే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచివి. బీన్స్ చాలా మంచి ఆహారం. వండిన తర్వాత కూడా ఇవి పీచును కలిగివుంటాయి. ఫ్రెంచ్ బీన్స్, కిడ్నీ బీన్స్ వంటి రకాలూ మంచివే. బెర్రీ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు అత్యధికంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలు, గూస్‌బెర్రీలు, రాస్ప్ బెర్రీలు, బ్లూబెర్రీల వంటివి విదేశాల్లో ఎక్కువగా తింటారు. గోంగూర, బచ్చలి, మెంతి, కరివేపాకులో పీచు అధికంగా వుంటుంది. అందుకే మన ఆహారంలో ఆకుకూరలు ప్రధానంగా వుండాలి. కాయధాన్యాలు సైతం పీచును అధికంగా కలిగి వుంటాయి. వీటిని కొద్దిగా తిన్నా కొవ్వు, ప్రొటీన్లు అధిక శక్తినిస్తాయి. ప్రతిరోజూ కాసిన్ని బఠాణీలు, బాదం, జీడిపప్పు, పిస్తా వంటివి తినాలి.ఆహారంలో రోజుకు 40-45 గ్రాముల పీచు ఉండటం అవసరం. ఇందులో కరిగే పీచు ఎక్కువగా వుంటే మరీ మంచిది. పీచు అందరికీ అవసరమే అయినా, కొందరు ప్రత్యేకించి ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి వుంటుంది. మలబద్ధకం, మధుమేహం, గుండెజబ్బులు, స్థూలకాయంతో బాధపడేవారు, మాంసాహారం తీసుకునేవారు తప్పకుండా పీచు ఎక్కువగా తీసుకోవాలి. పీచును ఎక్కువగా తీసుకుంటే అలర్జీల వల్ల వచ్చే ఉబ్బసం వ్యాధిని ఎదుర్కొనేలా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకులు ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఎలుకలపై కొన్ని ప్రయోగాలు చేయగా, పీచు పదార్థాలు పేగుల్లోని సూక్ష్మజీవుల సమతుల్యతను ప్రభావితం చేసి శ్వాసమార్గాల వాపు, నొప్పిని నివారిస్తాయని తేలింది.
పీచు పదార్థాలను అధికంగా తిన్న ఎలుకలు ఉబ్బసాన్ని ఎదుర్కొనగా, వాటిని తీసుకోని ఎలుకలు అలర్జీలకు గురయ్యాయని పరిశోధకులు గుర్తించారు. శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల్లో రోగనిరోధక శక్తి పెరగడానికి పీచు అవసరం ఉందని వారు తేల్చిచెబుతున్నారు.

-టివిఎల్లెన్ మూర్తి