రుచి

ఆకలిని అదుపుచేసే కివీపండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కివీ’ అనగానే న్యూజిలాండ్ గురొస్తుంది. ఈ పండ్లు న్యూజిలాండ్‌నే అధికంగా లభిస్తాయి. ఇవి ఇప్పుడు ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. ఈ పండులో పోషక పదార్థాలయిన సోడియం, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఫైబర్, కాపర్, యాంటీ ఆడ్సిడెంట్స్, విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, సి, డి, కెలు, ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఔషధ పరంగా ఈ పండు ఎంతగానో ఉపయోగిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తసరఫరా చక్కగా జరుగుతుంది. అధిక ఆకలిని అదుపు చేస్తుంది. రక్తంలో చక్కెర శాతం పెరగకుండా నియంత్రిస్తుంది. శరీరంలో ఏర్పడే ఫ్రీరాడిక్స్‌ను నివారించటానికి తోడ్పడుతుం ది. రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. ఆస్త్మా వ్యాధికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. క్యాన్స ర్ వ్యాధి రాకుండా నిరోధిస్తుంది. జీర్ణక్రియ చక్కగా జరిగేలా చేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. గర్భస్థ శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది. ప్రతిరోజూ ఈ పండును తింటే కంటి వ్యాధులు రావు. దృష్టిలోపం ఏర్పడదు. కంటిచూపు, కంటి ఆరోగ్యం బాగుంటుంది. వయస్సు పెరిగేవారిలో కణాలు క్షీణించకుండా కాపాడేందుకు దోహదపడుతుంది. వెంట్రుకలు రాలిపోకుండా రక్షణ కలిగిస్తుంది. దంతాల దృఢత్వాన్ని పెంచుతుంది. గోళ్లు చిట్లిపోకుండా, విరిగిపోకుండా ఉండేలాగానూ, గోళ్ళ పెరుగుదలకూ సాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్లేట్‌లెట్స్‌ను పెంచుతాయి.
...........................
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- కె.నిర్మల