రుచి

అటుకులతో వెరైటీ వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటుకులు ఆరోగ్య రీత్యా ఎంతో మంచిది. రక్తహీనతను తగ్గిస్తాయి. శుభకార్యాలకి అటుకులు వాడతారు. పెళ్లిల్లో సారె ఇచ్చేటప్పుడే అటుకులు తప్పనిసరిగా ఇస్తారు. ఇన్ని ఉపయోగాలున్న ఈ అటుకులతో బియ్యంతో చేసే వంటకాలన్నీ చేయవచ్చును. పులిహోర, దద్దోజనం, కిచిడి, బిర్యానీ, వెజిటబుల్ పోహ, వడలు, మిక్సర్, అప్పాలు, నిల్వ వడియాలు, పెరుగు దోశెలు, కట్టుపొంగలి, చక్రపొంగలి లాంటివి చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. తక్కువ ఖరీదుకు లభించే అటుకులలో దేశవాళీ, దంపుడు అటుకులుగా లభిస్తాయి. దంపుడు అటుకులు గట్టిగా ఉండి, బలవర్థకాన్ని ఇస్తాయి కూడా