సబ్ ఫీచర్

పాపం పిచ్చితల్లి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ రాజధాని ఢిల్లీలోని ఘజియాబాద్‌కు వెళితే అక్కడ ఓ పిచ్చితల్లి ట్రాఫిక్ పోలీసు దుస్తులు ధరించి ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ కనిపించేది. ఆమె చెప్పినట్లు వాహనదారులు కూడా బుద్దిగా తమ వాహనాలను ఒళ్లు దగ్గర పెట్టుకుని నడుపుతుంటారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో సరిగ్గా ఏడేళ్ల క్రితం నిక్కి అనే యువతి అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. కన్నకూతురు మరణంతో కుంగిపోయిన నిక్కి తల్లి డొర్రిస్ ఫ్రాన్సిస్ తన బిడ్డ వలే ఏ తల్లి కూడా కూతుర్ని, భర్తను, కుమారుడ్ని కోల్పోకోడదనే మంచి ఆలోచనతో ఆమె ఇలా ట్రాఫిక్ పోలీసు అవతారమెత్తి రోజు విడిచి రోజు నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌ను నియంత్రించే పనిలో నిమగ్నమవుతుంది. ఇలా హడావుడిగా వాహనాలపై వెళ్లేవారిని ప్రేమతో నియంత్రించటం మానసిక ధ్యానంగా భావిస్తానని డొర్రిస్ ఫ్రాన్సిస్ అనేది. వాహనదారులు కూడా ఆమెను పిచ్చిదానిగా భావించకుండా ఒక ట్రాఫిక్ పోలీసుగానే భావించి మసలుకుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే ఈ పిచ్చితల్లి ట్రాఫిక్‌ను నియంత్రించటం గత ఆరేళ్లుగా చేస్తుంది. కాని ఇపుడు ఈ పిచ్చితల్లి ఘజియాబాద్ ఏరియాలో కనిపించటం లేదని ఆరా తీస్తే.. ఢిల్లీ కాలుష్యం కాటో మరేమో కాని క్యాన్సర్‌బారిన పడింది. గత రెండు నెలల నుంచి నలతగా ఉంటున్న ఆమెను రెండో కుమార్తె ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించగా..క్యాన్సర్ బారిన పడినట్లు వైద్యులు నిర్థారించారు. ఆపరేషన్ చేయించుకున్న ఫ్రాన్సిస్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటుంది. ఫ్రాన్సిస్ త్వరగా కోలుకుని మళ్లీ మమ్మల్ని చక్కటి దారిలో వెళ్లేటట్లు చూడాలని ఘజియాబాద్ వాహనదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.