రుచి

తియ్యని కేకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిస్మస్ వచ్చిందంటే బేకరీలు ఆకర్షణీయమైన కేకులతో అలంకరించి ఆహ్వానిస్తాయి. ఇంట్లో చేసుకోవటం కూడా తేలికే. పిల్లలకు, పెద్దలకు ఆరోగ్యం.

కలర్ ఐసింగ్ క్రీమ్
వెన్న - 2 కప్పులు, నెయ్యి - 1 కప్ప తీసుకుని పంచదార మెత్తగా పొడిగా చేసి బాగా కలపాలి. దీనికి కలిపి చిన్న మిక్సర్‌లు ఉంటాయి. కేక్ డిజైనింగ్‌లో శ్రద్ధ వహిస్తే ఎన్నో డిజైన్‌లు సృష్టించవచ్చు. రంగుల విషయంలో ఫుడ్ కలర్స్ రకరకాలు దొరుకుతాయి. అవి ఎక్కువ ఖరీదు ఉంటాయి. అది ఇష్టం లేనివారు కూరగాయల నేచురల్ కలర్స్ వాడుకోవచ్చు.
కేకు తయారుచేసే విధానం: వీటి తయారీకి మైదాతో పాటు గోధుమ పిండి వాడితే మంచిది. కోడిగ్రుడ్డు తిననివారు చిక్కటి పెరుగు వేసి కలిపి చేసుకోవచ్చు.
కావాల్సిన వస్తువులు: మైదా - 2 కప్పులు
గోధుమ పిండి - 2 కప్పులు, ఏలకులు - 6, కోడిగ్రుడ్లు - 2,కొబ్బరి కోరు - 2 కప్పులు,వెన్న - 2 కప్పులు,పంచదారపొడి - 3 కప్పులు, బేకింగ్ పౌడర్ - 2 చెంచాలు, పెరుగు - 2 కప్పు లు, పాలు - 2 కప్పులు, చెర్రీలు, ఖర్జూరం, బా దం, జీడిపప్పులు - కావాల్సినన్ని వేసుకోవాలి.
ముందుగా కోడిగ్రుడ్డు సొన, ఇది తిననివారు పెరుగు గిలక్కొట్టాలి. దీనిలో వెన్న, కాచిన నెయ్యి వేసి బాగా గిలక్కొట్టాలి. దీనిలో మైదా, గోధుమ పిండి, పంచదార, ఏలకుల పొడి, కొబ్బరి పొడి చేర్చి బాగా గిలక్కొట్టాలి. దీన్ని మిక్సర్ పొడిలో వేసి బాగా కలుపుకోవాలి. పాలు పోసి కలిపితే జారుగా వస్తుంది. ఈ పిండిని ఓ గినె్నకు వెన్నరాసి పొయ్యాలి. ఐసింగ్ ఇష్టంలేనివారు గినె్నకు వెన్న రాసాక జీడిపప్పులు, బాదం పప్పులు పేర్చి దానిపై ఈ పిండి పోసి ఓవెన్‌లో కమ్మనివాసన వచ్చేలా ఉంచాలి. ఓవెన్ నుంచి తీసి దానిపై పప్పులు మధ్యలో కిస్‌మిస్‌లు చెర్రీలతో అలంకరిస్తే ఇంటి కేక్ రెడీ.
హార్లిక్స్ కేక్

హార్లిక్స్ పొడి - 6 చెంచాలు, మైదా - 2 కప్పులు, గోధుమ పిండి - 1 కప్పు, పంచదార - 3 కప్పులు, ఏలకులు - 6, దాల్చిన చెక్క పొడి - 2 చెంచాలు, లవంగ పొడి - 2 చెంచాలుఖర్జూరం ముక్కలు - 1 కప్పు, బాదం, పిస్తా, జీడిపప్పుల తరుగు - 1 కప్పు, నెయ్యి - 1 కప్పువెన్న - 2 కప్పులు, గట్టిపెరుగు - 1 కప్పు, చిక్కని పాలు - 1 కప్పు, బేకింగ్ పౌడర్ - 2 చెంచాలు, యాపిల్ ము క్కలు చిన్నవి - 1 కప్పు
క్యారెట్ కోరు - 1 కప్పు, కొబ్బరి కోరు - 1 కప్పు, ముందుగా హర్లిక్స్ పొడిని చిక్కని వేడి పాలల్లో కలిపి ఉంచాలి. మైదా, గోధుమ పిండి పొడులు అన్నీ కూడా కలిపి బాగా గిలక్కొట్టాలి. దోశెల పిండిలా నురగ వచ్చేలా గిలక్కొట్టాలి. క్యారెట్, కొబ్బరి కోరు నేతిలో దోరగావేయించుకోవాలి. కేక్ గినె్నకు నెయ్యి రాసి పప్పులు, డ్రైఫ్రూట్స్ పరవాలి. ఒక వరుస మిశ్రమం పోసి క్యారెట్, కొబ్బరి కోరు జల్లాలి. దానిపై మిశ్రమం మరలా పోసి సర్దాలి. పంచదార అన్నది మీరు తినే తీపిని మట్టి ఎక్కువ తక్కువ వాడుకోవాలి.

-వాణి ప్రభాకరి