రుచి

సంక్రాంతికి తియ్యగా...కారంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి తెలుగువారి పెద్ద పండగ. కొత్త అల్లుళ్ళను స్వాగతిస్తూ పిండి వంటలు ఘుమఘుమలాడతాయి. ఎన్ని ఎక్కువ పిండి వంటలు చేస్తే అంత పెద్ద ఎత్తున పండగ చేసుకున్నట్లు భావిస్తారు. కొత్త బియ్యంతో పాల పొంగులు కన్పిస్తాయి. తీపి, కారాల కలయికతో చేసే పిండి వంటకాలతో కమ్మని విందు ఆరగించటం ఆనవాయతీ.

ఓట్స్ మురుకులు

ఈ పండుగకి మురుకులు లేక జంతికలు కొందరయితే చక్రాలు అంటారు. వీటిని కొత్త బియ్యం పిండితో వండితే మంచి రుచి. ఓట్స్‌తో చేసే మురుకులు మంచి రుచిగా ఉంటాయ.

ఓట్స్ - 4 కప్పులు,బియ్యపిండి - 1 కప్పు, వెన్న - 1 కప్పు, ఉప్పు -2 చెంచాలు, పచ్చిమిర్చి అల్లం పేస్టు - 5 చెంచాలు, జీలకఱ్ఱ - 2 చెంచాలు, నూనె - 250 గ్రా.
పుట్నాల పొడి - 1/2 కప్పు, ఇంగువ - చింతగింజంత
నూపప్పు - 1 కప్పు, ఒక కప్పు నీరు మరగించి అందులో పచ్చిమిర్చి అల్లం పేస్ట్, ఇంగువ, జీలకఱ్ఱ ఉప్పు కలపాలి. పొంగులు రానివ్వాలి. దీన్ని వడగట్టి చిక్కని నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నువ్వులు, ఓట్స్ వేసి దోరగా వేయించి మిక్సీ పట్టాలి. దీనిలో పుట్నాల పప్పు పొడి- బియ్యం పిండి, ఉప్పు అన్నీ వేసి కలిపి వెన్న వేడినీళ్లలో కరిగించి పిండిలో పోసి పొడి పొడిగా కలపాలి. దీనికి ఇంగువ నీళ్ళు కలిపి ముద్దగా జంతికల పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇది మరీ గట్టిగాను పలుచగాను కాకుండా మీడియమ్‌గా జంతికలు లేక మురుకుల గొట్టంలో పెట్టి నొక్కితే ఓరుగా దిగేలా చూసుకోవాలి. నూనె కాగనిచ్చి చక్కగా షేప్‌లు వచ్చేలా చిల్లుల చట్రంపై చుట్టి దాన్ని నూనెలో పెట్టుకోవాలి. ఇలా మొత్తం పిండి అంతా మురుకులుగా చేసుకోవాలి. కరకరలాడు తూ వస్తాయి. ఇవి గుల్లగా వస్తాయి. వెరైటీగా ఉండి బలవర్థక వంటకం.

పన్నీర్ మైసూర్‌పాక్

జున్ను పౌడర్ అది2 కప్పులు, నెయ్యి - 2 కప్పులు, వేడిపాలు - 2 కప్పులు, పంచదార - 2 కప్పు లు, శెనగపిండి - 1 కప్పు, ఏలకులు - 5, కొబ్బరి నీరు - 1 కప్పు, జీడిపప్పులు - 24, కుంకుమ పువ్వు -1 చెంచా
ముందుగా వేడి పాలల్లో జున్ను పౌడర్ కలుపుకోవాలి. శెనగపిండి నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టాలి. పాలల్లో కుంకుమ పువ్వు కరిగించి ప్రక్కన ఉంచాలి. బాణలిలో పంచదార వేసి కొంచెం నీరు వేసి పాకం రానివ్వాలి. దానిలో వేయించిన శెనగపిండి వేసి కలిపి బుడగలు రానిచ్చి జున్నుపాలు పోసి ఏలకులు పొడి చేసి మిగిలిన నెయ్యి అంతా పోసి కలియబెడుతూ ఉండాలి. చివరగా వేయించిన కొబ్బరి, కుంకుమ పాలు పోసి మిగిలిన నెయ్యి అంతా వేసి కలుపుతూ ఉండాలి. గినె్ననుంచి మిశ్రమం విడిపోతుండగా జీడిపప్పులు వేసి కలిపి పళ్ళానికి నెయ్యి రాసి అచ్చుగా పోసుకోవాలి. ఇది గట్టిపడ్డాక ముక్క లు చేసుకోవాలి. పాల రుచితో తియ్యగా కమ్మగా ఉంటుంది.

నువ్వుల బాదం కాయలు

నూపప్పు - 1/2 కేజీ, బియ్యంపిండి - 1/4 కేజీ, బెల్లం కోరు - 1/2 కేజీ, ఏలకులు - 6, కొబ్బరి కోరు - 4 కప్పులు, నెయ్యి - 1 కప్పు, నూనె - 250 గ్రా.,జీడిపప్పులు - 1 కప్పు
బెల్లానికి రెండు కప్పుల నీరు చేర్చి పాకం తీగ వచ్చేలా రానిచ్చి, నెయ్యి, బియ్యంపిండి, వేయించిన నువ్వులు వేసి కలియబెట్టాలి. దింపే ముందర ఏలకులు, జీడిపప్పు ముక్కలు పోసి కలిపి దింపాలి. ఇపుడు ఈ పిండిని కోల బాదం కాయల మాదిరిగా చేసుకొని నూనె కాగాక అందులో వేసి వేయించాలి. ఇలా మొత్తం బాదంకాయలన్నీ వేయించుకోవాలి. ఇవి నెలకి నిల్వ ఉంటాయి.

మైదా అరిశెలు

మైదా - 2 కప్పులు, బియ్యం పిండి - 2 కప్పులు, నువ్వులు - 1 కప్పు, బెల్లం - 2 కప్పులు, నూనె - 500 గ్రా.
ముందుగా మైదా బియ్యంపిండి జల్లించి ఒక ప్రక్కన పెట్టుకోవాలి. దీనికి బెల్లం తరుగుకి ఒక కప్పు నీరు చేర్చి కొంచెం పాకం వచ్చాక దింపి పిండి పోసి కలిపి ముద్దగా చేసుకోవాలి. ఈ ముద్దను బంగళాదుంప సైజు ఉండలు చేసి, నువ్వుల్లో ముంచి ప్లాస్టిక్ పేపర్‌పై పూరీగా వత్తుకోవాలి. దీన్ని కాచిన నూనెలో వేయించాలి. ఇలా మొత్తం పిండి అంతా అరిశెలుగా చేసుకొని వేయించుకోవాలి.

మైదా పప్పు చెక్కలు

మైదా - 4 కప్పులు, బియ్యంపిండి - 4 కప్పులు, వెన్న - 1 కప్పు, ఉడికించిన పెసరపప్పు - 2 కప్పులు, జీలకఱ్ఱ - 5 చెంచాలు, అల్లం వెల్లుల్లి పేస్టు - 5 చెంచాలు, మిర్చి పేస్ట్ - 8 చెంచాలు, ఉప్పు - 4 చెంచాలు, నూనె - 250 గ్రా., గసగసాలు - 1 కప్పు, ముందుగా మైదా బియ్యపిండి కలిపి ఉడికించిన పెసరపప్పు, జీలకఱ్ఱ, అల్లం వెల్లుల్లి పేస్టు చేర్చి వెన్న వేసి ముద్దగా కలుపుకోవాలి. ఈ పిండిని నిమ్మకాయంత ఉండలు చేసుకొని గసగసాల్లో ముంచి పూరీగా వత్తుకుని (ఇది పీటపై చెయ్యాలి) నూనెలో వేయించి తియ్యాలి. ఇలా మొత్తం పిండి అంతా పూరీలుగా వత్తుకుని వేయించాలి. ఇవి నెలకుపైగా నిల్వ ఉంటాయి.

ఆకు పకోడీలు

బియ్యం పిండి - 4 కప్పులు, ఓట్స్ పిండి - 1 కప్పు, సోయపిండి - 1 కప్పు, వెన్న - 1 కప్పు, అల్లం మిర్చి పేస్ట్ - 5 చెంచా లు, జీలకఱ్ఱ - 2 చెంచాలు, నూనె - 250 గ్రా., కరివేపాకు - కొంచెం, పుదీనా - కొంచెం పైపిండిలన్నీ చేర్చి కరివేపాకు, పుదీనా ఆకు చేర్చి ముద్దగా నీరు చేర్చుతూ కలిపి రిబ్బన్ చట్రంలో పోసి కాగిన నూనెలో తిప్పితే రిబ్బన్ మాదిరి వస్తుంది. నెల నిల్వ ఉంటాయి.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు
మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- వాణిప్రభాకరి