రుచి

పెసరపప్పుతో చంద్రకాంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెసరపప్పుతో చేసే వంటలు ఒంటికి చలువ చేస్తాయ. వీటితో తియ్యటి చంద్రకాంతలు, సీరియాళి వంటి స్నాక్స్ కూడా చేసుకోవచ్చు.
పెసరపప్పు - 4 కప్పులు
పంచదార - 2 కప్పులు
నెయ్యి - 1/2 కప్పు
ఏలకులు - 5
కొబ్బరికోరు - 1/2 కప్పు
జీడిపప్పులు - 24
ఉప్పు - చిటికెడు
బేకింగ్ పౌడర్ - 1 చెంచా
కిస్‌మిస్ - 24
నూనె - 250 గ్రా.
పెసరపప్పు నానబెట్టి రుబ్బుకోవాలి. దీన్ని కుక్కర్‌లో ఉప్పు బేకింగ్ పౌడర్ చేర్చి పోసి ఉడికించాలి. నేతిలో కొబ్బరి, జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేయించి ప్రక్కన పెట్టాలి. పైన ఉడికిన పెసరపప్పులను గినె్ననుంచి పళ్లెంలో తడితే కేక్ మాదిరి వస్తుంది. దీన్ని డైమన్‌లుగా 24 ముక్కలు చేసుకుని నూనెలో వేయించి తియ్యాలి. వేరే గినె్నలో పంచదార పాకం పట్టి ఏలకులు కొబ్బరి చేర్చి దానిలో ఈ ముక్కల్ని వేసి పీల్చుకున్నాక తీసి పళ్లెంలో పెట్టి, జీడిపప్పులు, కిస్‌మిస్‌తో అలంకరించాలి.
**
సీరియాలి

పెసరపప్పు - 4 కప్పులు
నూనె - 250 గ్రా.
చింతపండు రసం- 2 కప్పులు
కరివేప - కొంచెం
మిర్చి - 5
ఆవాలు - 1 చెంచా
జీలకఱ్ఱ - 1 చెంచా
మెంతులు - 1/2 చెంచా
ఉప్పు - 2చెంచాలు
బెల్లం - చిన్నముక్క
ఎండుమిర్చి - 5
అల్లం- చిన్నముక్క
మినప్పప్పు - 2 చెంచాలు

పెసరప్పు నానబెట్టి రుబ్బి జీలకఱ్ఱ, మిర్చి, అల్లం చేర్చి కలిపి నూనె కాగాక పెసర పుణుకులుగా వేసుకోవాలి. వీటిని పక్కన పెట్టాలి. చింతపండు పులుసు ఉడికించి ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, మినపప్పు, పచ్చిమిర్చి చేర్చి వేయించి కలిపి ఈ పుణుకులు దీనిలో కలిపి ఉంచాలి. గంట తరువాత అన్నంలో వడ్డించాలి.
**
రవ్వ కిచడి

సన్న (బియ్యం) రవ్వ - 4 కప్పులు
పెసరపప్పు - 2 కప్పులు,జీలకఱ్ఱ - 4 చెంచాలు
అల్లంకోరు - 2 చెంచాలు, మిర్చి - 5
కరివేప - 4 రెమ్మలు, ఉప్పు - 1 1/2 చెంచా
శెనగపప్పు - 4 చెంచాలు, మినపప్పు - 4 చెంచాలు
బీన్స్ ముక్కలు - 1/2 కప్పు
క్యారెట్ ముక్కలు - 1/2 కప్పు, నెయ్యి - 1 కప్పు
నూనె - 1/4 కప్పు, ఆవాలు - 4 చెంచాలు జీడిపప్పులు - 24
వెడల్పు బాణలిలో నూనె వేసి పోపులు వేయించి కూర ముక్కలు వేసి ఐదు నిముషాలు వేగించి 8 కప్పుల నీరు పోసి ఉప్పు వేసి మూత పెట్టాలి. తరువాత బియ్యం రవ్వ పోసి నెయ్యి వేసి కలిపి సన్న సెగని పెడితే మగ్గుతుంది. ఇప్పుడు దీనిలో నానబెట్టిన పెసరపప్పు, జీడిపప్పు, అల్లంకోరు వేసి కలిపి మిగిలిన నెయ్యి వేసి మరో ఐదు నిమిషాలు సన్న సెగని మగ్గాక స్టౌ కట్టెయ్యలి. పది నిముషాల తర్వాత బేసిన్‌లో పోసి పళ్లాల్లో సర్దాలి. ఇది కొంచెం బిరుసుగా వస్తుంది. ఇంకొంచెం ముద్దగా కావాలనువాళ్ళు మరో నాలుగు కప్పుల నీరు చేర్చితే సరి.
**
పాఠోలి

పెసరపప్పు - 4 కప్పులు, ఎండుమిర్చి - 5
పచ్చిమిర్చి - 5, ఆవాలు - 2 చెంచాలు
జీలకఱ్ఱ - 2 చెంచాలు, కరివేప - 4 రెమ్మలు
అల్లం కోరు - 4 చెంచాలు, జీడిపప్పులు - 24
ఉల్లిముక్కలు - 1 కప్పు పసుపు - చిటికెడు
నూనె - 1 కప్పు, ఎండుమిర్చి - 4 చెంచాలు
పెసరపప్పు నానబెట్టి రుబ్బాలి. బాణలిలో పోపులు వేయించి ప్రక్కన పెట్టాలి. ఉల్లిముక్కలు, కరివేప వేయించి పైన రుబ్బిన పిండిని ఇందులో పోసి కలుపుతూ ఉండాలి. ఇది పొడి పొడిగా రవ్వ మాదిరి ఉడికి వస్తుంది. దీనిలో పైన వేయించిన పోపులో ఎండుకొబ్బరి, జీడిపప్పులు చేర్చి కలిపి దింపాలి. టిఫిన్‌గాను, అన్నంలోకి బాగుంటుంది.

-వాణిప్రభాకరి