రుచి

నోరూరించే బర్గర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు, పెద్దలు కూడా పాస్ట్ఫుడ్ సెంటర్లకు అల వాటు పడుతున్నారు. రోడ్డు పక్కన బేకరీల్లో లభించే బర్గర్ల వల్ల రోగా లు కొనితెచ్చుకోవటమే. అయితే ఇవాళ ఇవి ఇంటిలో కూడా చేసుకోవచ్చు. ఇవి తయారుచేసుకోవాలంటే ప్రత్యేక బర్గర్ బ్రెడ్ అమ్ముతారు.

సోయా బర్గర్
కావాల్సిన వస్తువులు
బ్రెడ్‌లు - 2, క్యారెట్ తరుగు - 1 కప్పు, చీజ్ ముక్కలు - 4, పన్నీరు తురుము - 1/2 కప్పు, టమోటా ముక్కలు - 8 సోయా సాస్ - 4 చెంచాలు, సోయా గింజలు - 1 కప్పు, జీలకఱ్ఱ - 2 చెంచాలు, అల్లం మిర్చి పేస్ట్ - 2 చెంచాలు, వెన్న - 1/2 కప్పు, ఉప్పు - 1/2 చెంచా, క్యాబేజీ తరుగు - 1 కప్పు, ముందుగా నానిన సోయా గింజలు, జీలకఱ్ఱ, అల్లం మిర్చి మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్‌ను సన్నటి వడలుగా చేసుకుని వెన్నతో కాల్చాలి. బ్రెడ్‌ను సగానికి కట్ చేసి పెనంపై వెన్నతో రెండు వైపులా కాల్చి తీసి ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ట్రేలో ఈ బ్రెడ్ పెట్టి క్యారెట్ తరుగు, ఉల్లి, టమోటా ముక్కలు పలుచగా సర్దాలి. తరువాత ఛీజ్ రాసి దీనిపై తరిగిన క్యాబేజీ కోరు పెట్టాలి. మళ్లీ ఛీజ్ పెట్టి దానిపై సోయా వడలు, టమోటా స్లైస్‌లు పెట్టుకోవాలి. దీనిపై కొబ్బరికోరు జల్లి మళ్లీ కాల్చి పెట్టుకున్న బ్రెడ్ ముక్క పైన పెట్టి బాగా అదమాలి. ఇలాగే రెండవ బ్రెడ్‌పై కూడా చేసుకుంటే రెండు బర్గర్లు తయారుచేసుకోవాలి. రెండు బ్రెడ్‌ల మధ్య పచ్చికూరలతో ఛీజ్ పెట్టి చేసేవే బర్గర్‌లు.

మొలకలతో బర్గర్
మొలకెత్తిన పెసలు, - 1కప్పు,టమోటా ముక్కలు - 6, ఉల్లి చక్రాలు - 6, ఖీరా ముక్కలు - 6, సోయా సాస్ - 5 చెంచాలు, ఛీజ్ ముక్కలు - 8, బర్గర్ బ్రెడ్ - 4, పుదీనా ఆకులు - అలంకరణకి ముందుగా బ్రెడ్ రెండుగా కోసి వెన్న వేసి పెనంపై కాల్చాలి. ఇప్పుడు పళ్ళెంలో బ్రెడ్ పెట్టి సోయా సాస్ రాసి టమోటా ముక్కలు ఆపైన ఉల్లి చక్రాలు పేర్చాలి. ఇప్పుడు ఛీజ్ ముక్క పెట్టి స్పౌట్స్ వేసి దానిపై ఛీజ్ ముక్క పెట్టి ఉల్లిముక్కలు టమోటా ముక్కలు పెట్టి పైన సోయా సాస్ రాసి దానిపై కాల్చిన బ్రెడ్ పెట్టి మూసి కొంచెం అదమాలి. ఈ రకంగా తయ రుచేసుకున్న బ్రెడ్‌బర్గర్‌పై పుదీనా ఆకులు పెట్టి అలంకరించుకోవాలి.

కార్న్ బర్గర్
కార్న్ గింజలు ఉడికించినవి - 2 కప్పులు, పచ్చిమిర్చి - 2, ఉల్లిముక్కలు - 1 కప్పు, అల్లం కోరు -2 చెంచాలు, కొబ్బరికోరు - 2 చెంచాలు, జీలకఱ్ఱ - 1 చెంచా, నిమ్మరసం - 1/2 కప్పు, ఉప్పు - 1/2 చెంచా, వెన్న - 1/2 కప్పుబ్రెడ్‌లు - 4, టమోటా - 4, ఖీరా ముక్కలు - 8 బాణలిలో వెన్న వేసి బ్రెడ్ వేపి తీసి పక్కనపెట్టాలి. ఇదే బాలిలో వెన్న వేసి జీలకఱ్ఱ, ఉల్లి, పచ్చిమిర్చి వేయించి అల్లంకోరు వేసి కలిపి దింపి నిమ్మరసం పిండాలి. ఇప్పుడు దీన్ని దింపి ప్రక్కన పెట్టాలి. బ్రెడ్‌కి వెన్న రాసి దానిపై ఖీర ముక్కలు, 2 టమోటా ముక్కలు పెట్టి దానిపై కార్న్ కూర పెట్టాలి. వీటిపై మళ్లీ టమోటా, ఖీరా ముక్కలు పెట్టి దానిపై బ్రెడ్ ముక్క పెట్టి నొక్కాలి. ఇది కూరతో మంచి రుచిగా ఉంటుంది.

ఫ్రూట్స్‌తో
ద్రాక్ష ముక్కలు - 1 కప్పు, యాపిల్ ముక్క లు సన్నగా తరిగినవి - 1 కప్పు, సపోటా ముక్కల ముద్ద - 2 కప్పులు, ఛీజ్ ముక్క లు - 4, దానిమ్మగింజలు -1 కప్పు, అరటిపళ్లు - 4, వెన్న - 1 కప్పు, పంచదార - 1/2 కప్పు, ఏలకుల పొడి - 1/2 చెంచా, కొబ్బరి కోరు - 2 చెంచాలు, బర్గర్ బ్రెడ్‌లు - 4, ముందుగా వెన్న పంచదార ఏలకులు, కొబ్బరి కోరు ముద్దగా చేసుకోవాలి. పళ్ల ముక్కలన్నీ కలిపి ముద్దగా చేసుకోవాలి. బ్రెడ్ వెన్నతో కల్చా దానిపై పంచదార క్రీమ్ రాసి పళ్ల ముద్దను పెట్టి మరలా ఛీజ్ ముక్క పెట్టి పళ్ల ముద్దను పెట్టి దానిపై పంచదార క్రీమ్ రాసి బ్రెడ్ సగం కాల్చి ఉంచినది పెట్టి నొక్కాలి. ఇలా అన్ని బర్గర్‌లు చేసుకోవాలి. ఫ్రూట్, క్రీమ్‌తో తియ్య తియ్యగా ఉంటుంది.

డ్రై ఫ్రూట్స్ బర్గర్
ఎండుకొబ్బరి పొడి -1 కప్పు, పుట్నాలపొడి - 1/2 కప్పు, జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కల పొడి - 1/2 కప్పు, ఎండు ఖర్జూరం ముక్కలపొడి - 1/2 కప్పు, ఏలకులు - 6, పంచదారపొడి - 1/2 కప్పు, వెన్న - 1 కప్పు, బర్గర్ బ్రెడ్ - 4, ఎండుద్రాక్షలు -1 కప్పు, ఛీజ్ ముక్కలు - 8, విధానం:ముందుగా వెన్నతో బర్గర్ బ్రెడ్‌వేయించి ప్రక్కన పెట్టాలి. ప్రతి బ్రెడ్ రెండు ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన వెన్న పంచదార పుట్నాలపొడి ఏలకులపొడి అన్నీ ముద్దగా కలపాలి. బ్రెడ్ ముక్కపై ఛీజ్ ముక్క ఉంచి డ్రైఫ్రూట్స్ క్రీమ్ ముద్ద పెట్టి, ఛీజ్ ముక్క పెట్టి దానిపై బ్రెడ్ ముక్క పెట్టి నొక్కి ఉంచాలి. ఇలా నాలుగు బ్రెడ్‌లు నాల్గు బర్గర్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తంగా రకరకాల బర్గర్లు ఈ నూతన సంవత్సరంలో తిని ఆనందించండి.

- వాణి ప్రభాకరి