రుచి

ఫ్రూట్ హల్వా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హల్వా అనగానే శనగపిండి, గోధుమ పిండితో చేసేవే జ్ఞప్తికి వస్తాయి. కాని పండ్లతో కూడా నోరూరించే హల్వాలు చేసుకోవచ్చు. ఆరోగ్య రీత్యా మంచివి. యాపిల్, పైనాపిల్, సపోటా, సీతాఫలం, కర్బూజా, జామ, మామిడి, ద్రాక్ష, దానిమ్మ, కమలా హల్వాలు, పందిరిదోస పుచ్చ వంటి వాటితో రకరకాల హల్వాలు చేసుకోవచ్చు.
దానిమ్మ హల్వా
దానిమ్మ గింజలు - 4 కప్పులు, పిస్తా పప్పులు - 6, జీడిపప్పులు - 6, నెయ్యి - 1/2 కప్పు, పంచదార - 1 కప్పు, ఎండుకొబ్బరి -2 చెంచాలు, నువ్వుల

పొడి - 1/2 కప్పు, ఏలకులు - 6
గింజలు వలచి నేతిలో వేయించాలి. పప్పులు అన్నీ నేతిలో వేయించాలి. ఇప్పుడు దానిమ్మ గింజల్ని మిక్సీ పట్టి ముద్దగా చేసుకోవాలి. పంచదార పాకం రానిచ్చి దానిలో నువ్వుల పొడి కొబ్బరి పొడి, దానిమ్మ గింజల ముద్ద వేసి కలపాలి. మిగిలిన నెయ్యి, ఏలకుల పొడి వేసి కలిపి గినె్న నుంచి మిశ్రమం విడి
పోతుండగా దింపి పళ్ళానికి నెయ్యి రాసి మిశ్రమం పోసి సర్దాలి. చల్లారాక ఫ్రిజ్‌లో పెడితే ముక్కలు గట్టిగా వస్తాయి.
పందిరి దోస హల్వా
పందిరి దోస ముక్క లు - 5 కప్పులు, పంచదార - 2 కప్పులు గసగసాల పొడి - 1/2 కప్పు, నెయ్యి - 1/2 కప్పు, వేరుశెనగ పప్పు లు - 1/2 కప్పు, ఏలకులు -6.
ముందుగా పప్పులన్నీ నేతిలో దోర గా వేయించాలి. దానిలో పందిర దోస ముక్కలు వేసి మగ్గనివ్వాలి. మెత్తగా ఉడికాక గరిటెతో ముద్దగా బాణలిలోనే ననపాలి. దీనికి పంచదార చేర్చి మిగతా నెయ్యి పోసి మగ్గనివ్వాలి.
ఇది బుడగలు వస్తూ ఉడికాక గసగసాలపొడి, వేరుశెనగ పలుకులు వేసి, ఏలకుల పొడి వేసి కలిపి ఉడికించి దింపాలి. పళ్ళానికి నెయ్యి రాసి ఈ మిశ్రమం పోసి సర్దాలి. చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచితే గట్టిపడుతుంది. దీన్ని నచ్చిన ఆకృతిలో ముక్కలుగా చేసుకోవాలి.

- వాణీ ప్రభాకరి