రుచి

పుదీనా లస్సీతో చలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి ఎండలు మండిపోతున్నాయి. చమట కారణంగా శరీరంలోని నీటిశాతం తగ్గిపోయి నిస్త్రాణ వస్తుంది. అందువల్ల ఎలక్ట్రోలైట్స్ బయటకు వెళ్లిపోవడంతో నిస్సత్తువ ఆవరించి వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు పుదీనా కలపిన లస్సీ లేదా పుదీనా కలపిన మజ్జిగను తాగితే ఎంతో మేలు జరుగుతుంది. వాటిలో పుష్కలంగా లభించే ఎలక్ట్రోలైట్స్ త్వరితగతిన శక్తినిస్తాయి. ఉదరంలో గడబిడ తగ్గుతుంది. కాల్షియం శాతం ఎక్కువగా ఉండే మజ్జిగ వల్ల బరువుతగ్గుతారు. పుదీనా వల్ల ఉత్సాహం ఇనుమడిస్తుంది. పైగా నోటిదుర్వాసన, చమట వల్ల వచ్చే దుర్వాసనను దూరం చేస్తుంది. శరీరంలో వేడిని తగ్గించే శక్తి పుదీనాలస్సీకి ఉంటుంది.