రుచి

పనసతో విందు.. పసందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవికాలంలో మాత్రమే పనసకాయలు, పండ్లు లభ్యమవుతాయి. కాయలను పొట్టుగా తరిగి చేసే కూరలు, పండ్లలోని తియ్యటి తొనలు నోరూరిస్తాయి. చివరకు వాటి గింజలతోనూ వంటలు చేస్తారు. పనస ఆకులతో విస్తర్లు చేస్తారు. ఔషధ గుణాలుండే పనస ఎన్నో రోగాల నివారణకు పనిచేస్తుంది. ముఖ్యంగా వీటిలో ఉండే ఫైటో న్యూట్రియంట్లు, ఐసోఫ్లేవిన్లు క్యాన్సర్ నివారణకు బాగా పనిచేస్తాయి. పనసలో పుష్కలంగా ఉండే పొటాషియం రక్తపోటు నియంత్రణకు పనిచేస్తుంది. ఇక ఇందులోని సివిటమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మలబద్దకాన్ని నివారించే పీచుపదార్థాలు వీటి తొనల్లో ఉంటాయి. వేడిచేసిన ఆకులతో గాయాలు, పుండ్లు తగ్గుతాయి. గింజలతో చేసే చూర్ణం మరికొన్ని చర్మవ్యాధులకు పనిచేస్తుంది. అయితే వాతం, క్షయ, పాండురోగం వంటి దీర్ఘకాలిక రోగాలున్నవారు పనసకు దూరంగా ఉండటం అవసరం. ఇక పనసపొట్టుతో చేసే కూరలు ఇష్టపడని శాఖాహారులు ఉండరంటే నమ్మాల్సిందే.