రుచి

నల్లనల్లని నేరేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లనల్లని నేరేడు పండ్లు మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ కాలం లో సమృద్ధిగా దొరికే ఈ పండ్లలో ఉండే ఆమ్లాలే ఈ పండుకు ప్రత్యేకమైన రుచిని అందిస్తున్నాయి. అటు తీపి కాదు, పూర్తిగా వగరు కాదు. అదోరకమైన గమ్మత్తయిన రుచి. ఇందులో ఆక్సాలిక ఆమ్లం, మాలిక ఆమ్లం వంటివి ఉండటం వల్లే ఈ పండుకు ఈ రుచి వచ్చిందని పరిశోధనల్లో వెల్లడైంది. నేరేడు పండ్లను పండిన తరువాత సాస్‌ను తయారు చేస్తారు. అంతేకాదు పచ్చికాయలను వెనిగర్‌ను తయారుచేస్తారు. వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తాయి. వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశమున్నది. అలాంటి అనారోగ్యాల నుంచి కాపాడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉన్నాయి. డయాబెటీస్‌తో పోరాడతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు మహత్తరమైన మందుగా ఉపయోగపడుతుంది. సుగర్ లెవల్స్ సమతుల్యంగా ఉండేటట్లు చేస్తాయి. తప్పనిసరిగా ఈ పండ్లను సీజన్‌లో తీసుకోవటం మంచిదని పెద్దలు సైతం చెబుతుంటారు. నేరేడు పళ్లపై ఉప్పు చల్లుకుని తింటే బాగుంటుంది. నేరేడుకాయ ముందు ఆకుపచ్చగానే ఉంటుంది. రానురాను ముదురు ఇంకు రంగులోకి మారుతోంది. మార్కెట్లో వీటిని విక్రయించటానికి ఈ పండ్లు నిగనిగలాడేలా కనపడేందుకు నూనె పూస్తారు. ప్రకృతి ప్రసాదించిన ఈ పండును కొనుగోలు చేసేముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు
మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03