రుచి

ఆకు కూర అప్పడాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బియ్యంపిండి - 4 కప్పులు, మెంతికూర లేక మునగ ఆకు - 8 కప్పులు, గోధుమ పిండి - 4 కప్పులు, ఉప్పు - 8 చెంచాలు, నూనె - అర కప్పు, పచ్చిమిర్చి ముక్కలు - 100 గ్రా., ఇంగువ - 1/2 చెంచా పొడి, నీరు - 8 కప్పులు, జీలకఱ్ఱ - 5 చెంచాలు, నువ్వులు - 1/2 కప్పు, మైదాపిండి - 2 కప్పులు
ముందుగా పిండిలో ఉప్పు, పచ్చిమిర్చి, ఇంగువ, జీలకఱ్ర, నువ్వులు అన్నీ వేసి బాగా కలపాలి. తరిగిన ఆకు కూర ముక్కల్ని కలిపి బాగా మర్దించాలి. ఇప్పుడు వేడినీరు కొంచెం జల్లుతూ పిండి కలిపి తడిబట్టతో చుట్టి ఉంచాలి. ఒక గంట బాగా నానాక దీన్ని బంగాళాదుంప సైజు ఉండలుగా చేసుకొని మైదా పిండి తడితో అప్పడాలు కొంచెంగా వత్తుకోవాలి. మైదా జిగురు వల్ల అప్పడాలు బాగా వస్తాయి. ఎండాక డబ్బాలో పెట్టుకోండి. ఇవి ఒక నెల నిల్వ ఉంటాయి. ఆకు కూరవల్ల ఎక్కువకాలం నిల్వ ఉండవు.
పెండెలం పిండి, రాగిపిండి, సోయపిండి, గోధుమపిండి- ఏ పిండి అయినా సరే పెసర పిండితో కలిపి, ఇంగువ, జీలకఱ్ఱ, మిర్చి చేర్చి అప్పడాలుగా వత్తుకోవచ్చును. ఇవి ఐదారు నెలలు నిల్వ ఉంటాయి. మధ్యలో చూసి ఎండలో పెడుతుండాలి.