రుచి

పన్నీర్ పాయసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాదివారు ఎక్కువగా ఇష్టపడే పదార్థం పన్నీర్ పాయసం. పనీర్ ఖీర్ అని పిలుస్తారు. పండుగలకే కాదు వ్రతాల్లోనూ ఉత్తరాది వారు నైవేద్యంగా దీన్ని సమర్పిస్తారు. గట్టిపడిన పాల తియ్యదనం, డ్రైఫ్రూట్ ముక్కలతో, పన్నీర్ ఉప్పదనం తగులుతూ పిల్లలకూ, పెద్దలకూ అద్భుతమైన రుచిని అందిస్తోంది. ఇంట్లోనే ఈ పాయసాన్ని తయారుచేసుకోవచ్చు.

కావల్సినవి : తరిగిన పన్నీర్ అర కప్పు, గట్టిపర్చిన పాలు మూప్పావు కప్పు, పాలు అర లీటరు, అలంకరణకు డ్రైఫ్రూట్స్, ఏలకుల పొడి చెంచా.

తయారుచేసే విధానం: తరిగిన పన్నీర్‌ను వేడి పెనంలో వేయండి. వెంటనే పాలను కలపండి. ఐదు నిమిషాలు పాటు ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి. గట్టిపాలను కూడా పోసి మరో నాలుగు నిమిషాలపాటు కలుపుతూనే ఉండండి. తరువాత ఏలకుల పొడిని వేసి బాగా కలపండి. డ్రైఫ్రూట్స్‌ను, ఒక చెంచా తరిగిన బాదంపప్పును కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక గినె్నలోకి తీసుకుని దీనిపై తరిగిన బాదం, కిస్మిస్‌తో అలంకరించి వడ్డించండి.